Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • తెల్ల కాగితం’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో బండ్ల గణేష్ ఆసక్తికర వ్యాఖ్యలు..

    Author VENKATESH | 01 Oct 2026, 11:43 AM | Cinema
    తెల్ల కాగితం’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో బండ్ల గణేష్ ఆసక్తికర వ్యాఖ్యలు..

    ‘కోర్ట్’, ‘బ్యాండ్ మేళం’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న హర్ష్ రోషన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘తెల్ల కాగితం’. రమేష్ బండ్రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో నక్షత్ర కథానాయికగా పరిచయం అవుతోంది. అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ కొమ్మాలపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ యూత్‌ఫుల్ ఎమోషనల్ లవ్ ఎంటర్‌టైనర్ అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదలకు ముందు చిత్రబృందం ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ముఖ్య అతిథిగా హాజరై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దర్శకుడు రమేష్ తన కష్టాల గురించి చెప్పడాన్ని ప్రస్తావిస్తూ.. జీవితంలో ఎప్పుడూ ఇతరుల గురించి కాకుండా మన గురించి, మన ఎదుగుదల గురించి ఆలోచించాలని సూచించారు.
    ‘‘జీవితంలో పక్కవారి గురించి ఎక్కువగా ఆలోచిస్తే మన ప్రయాణం ముందుకు సాగదు. మనం ఎలా పైకి వెళ్లాలి? ఏం సాధించాలి? అనేదే ఆలోచించాలి. ఇతరులు మనల్ని విమర్శించినా, ఇబ్బంది పెట్టినా వాటిని పట్టించుకోకుండా మన లక్ష్యం వైపు వెళ్లాలి. అదే మన గోల్’’ అంటూ బండ్ల గణేష్ వ్యాఖ్యానించారు. డైరెక్టర్ రమేష్ మాట్లాడుతూ బాధ పడ్డానని, అమ్మని తీసుకొచ్చానని, దుఃఖ పడ్డానని అంటున్నాడు. ఆయనలాగా నేను బాధ పడితే ఇప్పటికి 500 సార్లు ఆత్మహత్య చేసుకోవాల్సి వ‌చ్చేది. ఎందుకంటే నా గురించి రోజుకొకటి రాస్తారు. జీవితంలో పక్కోడి గురించి ఆలోచిస్తే, అస‌లు నేను షాద్ నగర్ లో ఉండేవాడిని కూడా కాదు.. నువ్వు (రమేష్) భీమవరంలో ఉండాలి. మ‌న గురించి మాత్ర‌మే మ‌నం ఆలోచించుకోవాలి. ఎద‌గ‌డానికి ప్ర‌య‌త్నించాలి. ప‌క్కోడు మ‌న గురించి ఏడ‌వాలి, తిట్టాలి, మ‌నం పైకి చేరుకోవాలి అని బండ్ల గ‌ణేష్ స్ప‌ష్టం చేశారు.నిర్మాత కృష్ణ కొమ్మాలపాటితో తనకున్న అనుబంధాన్ని కూడా బండ్ల గణేష్ గుర్తుచేసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా ఆయనతో తనకు స్నేహం ఉందని చెబుతూ.. కృష్ణ ఎంతోమందికి సహాయం చేస్తూ, సినిమా కోసం తన జీవితాన్ని అంకితం చేశారని అన్నారు.‘కృష్ణ అన్న మనసు తెల్ల కాగితం. ప్రతి ఒక్కరూ ఆయనతో పని చేయించుకుని వదిలేశారు.