Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • బీసీ రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు

    Author VENKATESH | 01 Oct 2026, 11:51 AM | ANDHRA PRADESH
    బీసీ రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు

    స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. ఈ రెండు జీవోలను సవాల్ చేస్తూ న్యాయవాది తాండవ యోగేష్.. హైకోర్టు‌లో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయగా.. సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. మొత్తం రిజర్వేషన్లు 59 శాతం మించకూడదని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు ప్రకారం ఈ జీవోలు చెల్లవని న్యాయస్థానం స్పష్టం చేసింది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని పేర్కొంది. బీసీల జనగణన తరువాత ఎన్నికలు నిర్వహించాలని వేసిన పిటిషన్‌ను కూడా హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది.గ్రామ పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థలకు తక్షణమే ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాలను అనుమతించిన హైకోర్టు.. ఆరువారాల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఎస్ఈసీకి ఆదేశాలు జారీ చేసింది.