Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • నారా లోకేశ్‌పై రాజ్‌దీప్ సర్దేశాయ్ ప్రశంసలు

    Author VENKATESH | 01 Oct 2026, 12:17 PM | ANDHRA PRADESH
     నారా లోకేశ్‌పై రాజ్‌దీప్ సర్దేశాయ్ ప్రశంసలు

    ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌‌పై ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ ప్రశంసల జల్లు కురిపించారు. ఇటీవల లోకేశ్‌తో రాజ్‌దీప్ ముఖాముఖి సంభాషణ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, జాతీయ అంశాలు, రాజకీయాలపై వీరిద్దరి మధ్య చర్చ సాగింది. ఈ సందర్భంగా లోకేశ్ స్పందించిన తీరుపై రాజ్‌దీప్‌ ప్రశంసలు కురిపించారు. ఇంటర్వ్యూ సమయాల్లో ముందస్తు ప్రశ్నలు కోరని నాయకులను ఇంటర్వ్యూ చేయడం ఎప్పుడూ సులభంగా ఉంటుందని సీనియర్ జర్నలిస్ట్ అన్నారు.గతంలో అందరు నాయకులు ఇలాగే ఉండేవారని.. కానీ ఇప్పుడు మాత్రం ఇది ఒక మినహాయింపుగా మారిందని వ్యాఖ్యానించారు. లోకేశ్‌ను చూసి ఇతర నాయకులు కూడా నేర్చుకోవాలంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎటువంటి స్క్రిప్ట్ లేకుండా, తాను సంధించిన కఠిన ప్రశ్నలకు ఏపీ మంత్రి సూటిగా సమాధానాలు ఇచ్చారని సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ ప్రశంసించారు.