Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఫ్లైదుబాయ్ విమానానికి ప్రమాదం ఎలా తప్పిందంటే?

    Author VENKATESH | 01 Oct 2026, 09:29 PM | INTERNATIONAL
    ఫ్లైదుబాయ్ విమానానికి ప్రమాదం ఎలా తప్పిందంటే?

    ఇజ్రాయెల్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ ఫ్లైట్‌లో ఐదు మిరాకిల్స్‌ జరిగాయి. దీంతో హైజాకింగ్‌ వంటి ఉగ్రవాద కుట్రతోపాటు కూలే ప్రమాదం నుంచి ఆ విమానం బయటపడింది. ఆ ఫ్లైట్‌లోని ఐదుగురు హీరోలు సకాలంలో స్పందించారు. ఘోర విమాన ప్రమాదాన్ని వారు తప్పించారు. సెప్టెంబర్‌ 30న ఫ్లైదుబాయ్‌కు చెందిన ఎఫ్‌జెడ్‌ 1073 విమానం 174 మంది ప్రయాణికులతో దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు బయలుదేరింది. ఆ విమానం 30,000 అడుగుల ఎత్తులో ఎగురుతుండగా ఒమన్ దేశస్థుడైన కో-పైలట్ హైజాకింగ్ ప్రయత్నం చేశాడు. భారత కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై పదునైన ఆయుధంతో దాడి చేశాడు. కాక్‌పిట్‌లో జరుగుతున్న ఈ దాడి కారణంగా ఆ విమానం అదుపుతప్పింది. సుమారు రెండు నిమిషాల్లో 17,000 అడుగుల మేర కిందకు దిగింది. కూలేందుకు వేగంగా భూమి మీదకు అది దూసుకెళ్లసాగింది. దీంతో అందులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనతో హాహాకారాలు చేశారు.
    కాగా, ఫ్లైదుబాయ్ ఫ్లైట్‌ కూలే ప్రమాదం అంచున ఉన్న సమయంలో ఐదు అద్భుతాలు జరిగాయి. కో పైలట్‌ దాడిలో తీవ్రంగా గాయపడిన భారత కెప్టెన్ మచ్చర్ నేలపై పడి ఉన్నప్పటికీ, కాక్‌పిట్ డోర్‌ను అన్‌లాక్‌ చేయగలిగారు. సహాయం కోసం ఆయన కేకలు వేశారు. ఆ విమానంలో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు వెంటనే స్పందించారు. ప్లంబర్ అయిన యానివ్ హయున్, దంత వైద్యుడైన డాక్టర్ షోటా ముసయేవ్, బీమా ఏజెన్సీ యజమాని అయిన అస్సాఫ్ రజువాన్, బ్యాంకర్ అయిన జ్వికా మాన్స్ చాలా సాహసోపేతంగా వ్యవహరించారు.
    ఈ ఐదుగురు వెంటనే కాక్‌పిట్‌లోకి దూసుకెళ్లారు. ఆ విమానంలో ప్రయాణికులకు ఇచ్చిన హెడ్‌ఫోన్‌ల కేబుళ్లను ఉపయోగించి కో-పైలట్‌ను నియంత్రించారు. విమానం కంట్రోల్ ప్యానెళ్లను పాడుచేయడానికి అతడు చేపిన ప్రయత్నాన్ని అడ్డుకుని బంధించారు. అదే సమయంలో దంత వైద్యుడైన డాక్టర్ షోటా ముసయేవ్, భారత కెప్టెన్ మచ్చర్ ప్రాణాలు కాపాడేందుకు ఉపక్రమించారు. రక్తస్రావాన్ని ఆపి ఆయన పరిస్థితిని స్థిరంగా ఉంచడంపై దృష్టిసారించారు.
    మరోవైపు విమానయాన కార్యక్రమాల టీవీ షోలను ఆసక్తిగా చూసే ఇజ్రాయోలీ ప్లంబర్ యానివ్ హయున్
    చాలా కీలకంగా వ్యవహరించారు. పైలట్‌గా ఎలాంటి శిక్షణ లేనప్పటికీ తనకు ఉన్న పరిజ్ఞానంతో తక్షణం స్పందించారు. ప్రమాదకరంగా కిందకు దూసుకెళ్తున్న విమానాన్ని కంట్రోల్‌ చేశారు. స్టీరింగ్ లివర్లను పైకి లాగాలని తెలియడంతో ఆ పని చేశారు. దీంతో ఆ విమానం తిరిగి నియంత్రణలోకి వచ్చింది. అదృష్టవశాత్తు విధుల్లో లేని ఇద్దరు పైలట్లు ఆ విమానంలో ప్రయాణిస్తున్నారు. వారిద్దరూ వెంటనే పైలట్ బాధ్యతలు చేపట్టారు. సౌదీ అరేబియాలోని తబూక్ విమానాశ్రయానికి విమానాన్ని మళ్లించి అత్యవసరంగా ల్యాండ్ చేశారు