Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఉక్రెయిన్ వార్‌ను ఆపే మంచి ఆలోచ‌న‌లు మోదీ వ‌ద్ద ఉన్నాయి

    Author VENKATESH | 02 Oct 2026, 11:22 AM | INTERNATIONAL
     ఉక్రెయిన్ వార్‌ను ఆపే మంచి ఆలోచ‌న‌లు మోదీ వ‌ద్ద ఉన్నాయి

    ప్ర‌ధాని మోదీని పుతిన్ ప్ర‌శంసించారు. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ముగించే అంశంపై ప్ర‌ధాని మోదీ వ‌ద్ద మంచి ఐడియాలు ఉన్నాయంటూ ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ పేర్కొన్నారు. ఉమ్మ‌డి అంగీకారం ద్వారా యుద్ధాన్ని ఆపే ఐడియాలు మోదీ వ‌ద్ద ఉన్న‌ట్లు పుతిన్ తెలిపారు.త‌న‌తో భేటీ అయిన ప్ర‌తిసారి యుద్ధాన్ని ఆపే అంశం గురించి ఆయ‌న చ‌ర్చిస్తుంటార‌ని పుతిన్ పేర్కొన్నారు. వ‌ల్దాయి ఇంట‌ర్నేష‌న‌ల్ డిస్క‌ష‌న్ క్ల‌బ్ మీటింగ్ స‌మ‌యంలో పుతిన్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్య‌లు చేశారు. యుద్ధాల‌ను ఆప‌డంలో మోదీ వ్యూహాం ప్ర‌త్యేక‌మైంద‌ని, ప్ర‌పంచ నేత‌ల్లో ఆయ‌న ఒక‌రు అని, ఆయ‌న‌తో మంచి సంబంధాలు ఉన్నాయ‌ని, స్నేహ‌పూర్వ‌క సంబంధాలు ఉన్నాయ‌ని, వ్య‌క్తిగ‌తంగానూ మంచి రిలేష‌న్ ఉంద‌ని, ఎక్క‌డ క‌లిసినా ప్ర‌తిసారి ఉక్రెయిన్ యుద్ధం ముగింపు గురించి అడుగుతుంటార‌ని పుతిన్ అన్నారు.