Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఏంటీ.. లారెన్స్‏కు ఇంత పెద్ద కూతురు ఉందా.

    Author VENKATESH | 05 Jun 2026, 12:13 PM | Cinema
    ఏంటీ.. లారెన్స్‏కు ఇంత పెద్ద కూతురు ఉందా.

    సినీ పరిశ్రమలో కొరియోగ్రాఫర్‌గా కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి రాఘవ లారెన్స్. ముఖ్యంగా ‘ముని’, ‘కాంచన’ సిరీస్‌లతో హారర్ థ్రిల్లర్ సినిమాలకు ఆయన కేరాఫ్ అడ్రస్‌గా మారారు. ప్రస్తుతం ‘కాంచన 4’తో పాటు లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్‌కు చెందిన ‘బెంజ్’ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్న లారెన్స్ కుటుంబం నుంచి ఇప్పుడు ఒక క్రేజీ అప్‌డేట్ ఫిలిం నగర్ సర్కిల్స్‌లో వైరల్ అవుతోంది. రాఘవ లారెన్స్ వారసురాలు, ఆయన కుమార్తె రాఘవి త్వరలోనే చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టబోతున్నారు. అయితే సాధారణంగా స్టార్ వారసులు అనగానే నటన వైపు మొగ్గు చూపుతారు. కానీ రాఘవి మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తూ మెగాఫోన్ పట్టి డైరెక్టర్ సీట్లో కూర్చోవాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు.రాఘవి ప్రస్తుతం అమెరికాలో సినిమా మేకింగ్‌కు సంబంధించిన ప్రత్యేక కోర్సు పూర్తి చేస్తున్నారు. ఆమెకు సినిమాలోని వివిధ విభాగాలపై మంచి అవగాహన ఉంది. తండ్రిలాగే లారెన్స్ కూడా రాఘవేంద్రస్వామి భక్తుడు కావడంతో తన కుమార్తెకు ‘రాఘవి’ అని పేరు పెట్టారు. అయితే ఆమె ఇప్పటివరకు మీడియా ముందుకు పెద్దగా రాకపోవడంతో, లారెన్స్‌కు ఇంత పెద్ద కుమార్తె ఉందనే విషయం చాలామంది ప్రేక్షకులకు తెలియదు.