Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • 5 నిమిషాల్లో సూపర్ బ్రేక్‌ఫాస్ట్‌.. ప్రోటీన్ల గనితో రోజంతా ఫుల్ ఎనర్జీ!

    Author VENKATESH | 05 Jun 2026, 12:20 PM | HEALTH
    5 నిమిషాల్లో సూపర్ బ్రేక్‌ఫాస్ట్‌.. ప్రోటీన్ల గనితో రోజంతా ఫుల్ ఎనర్జీ!

    ఆరోగ్యకరమైన ఆహారాన్ని డైట్‌లో చేర్చుకోవాలనుకునే వారికి నల్ల శనగల చాట్ (కాలా చనా చాట్) ఒక అద్భుతమైన ఎంపిక. కేవలం కొన్ని నిమిషాల్లోనే ఇంట్లో లభించే వస్తువులతో ఈ పోషకాల గనిని సిద్ధం చేసుకోవచ్చు. నల్ల శనగల్లో ప్రొటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల ఇది బరువు తగ్గడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి ఎంతో సహాయపడుతుంది. ఈ హెల్తీ చాట్ తయారు చేయడం కూడా చాలా సులభం. మొదట నల్ల శనగలను రాత్రంతా నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం కొద్దిగా ఉప్పు వేసి కుక్కర్‌లో 4 నుండి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి.ఉడికించిన శనగలను ఒక గిన్నెలోకి తీసుకుని చల్లార్చాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, టమోటా ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు వేయాలి. మరింత రుచి కోసం కొద్దిగా ఉడికించిన బంగాళాదుంప ముక్కలు లేదా దోసకాయ ముక్కలను కూడా చేర్చుకోవచ్చు. చివరగా రుచికి సరిపడా ఉప్పు, వేయించిన జీలకర్ర పొడి, కొద్దిగా కారం, ముఖ్యంగా చాట్ మసాలా చల్లుకోవాలి. వీటన్నింటిపై అర దబ్బ నిమ్మరసాన్ని పిండి, బాగా మిక్స్ చేస్తే నోరూరించే చనా చాట్ సిద్ధమౌతుంది.ఇందులో ఫైబర్ (పీచు పదార్థం) ఎక్కువగా ఉండటం వల్ల కొద్దిగా తిన్నా కడుపు నిండినట్లు అనిపిస్తుంది. ఇది అతిగా తినడాన్ని నివారించి బరువు తగ్గడానికి దోహదపడుతుంది. నల్ల శనగలు జీర్ణవ్యవస్థను శుభ్రపరచడంలో, మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేయడంలో కీలకంగా పనిచేస్తాయి.