Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఏఐతో టీకా అభివృద్ధి.. పలు వైరస్‌లను అడ్డుకొనేలా తయారీ

    Author VENKATESH | 06 Jun 2026, 11:46 AM | HEALTH, INTERNATIONAL
    ఏఐతో టీకా అభివృద్ధి.. పలు వైరస్‌లను అడ్డుకొనేలా తయారీ

    యూకేలోని యూనివర్సిటీ ఆఫ్‌ కేంబ్రిడ్జ్‌లోని ఒక బృందం ప్రపంచంలోనే తొలిసారిగా పూర్తిగా ఏఐను ఉపయోగించి టీకాను అభివృద్ధి చేసింది. ఈ టీకాను మనుషులపై ప్రయోగించినట్టు వెల్లడించింది. ఈ టీకాను అన్ని రకాల కరోనా వైరస్‌లు, మహమ్మారులు, జంతువులకు సోకే వైరస్‌లు, భవిష్యత్తులో మరో మహమ్మారిని సృష్టించే సామర్థ్యం ఉన్న వైరస్‌లను నిరోధించేందుకు ఉపయోగించవచ్చని ఆ బృందం తెలిపింది.
    అయితే ఈ వ్యాక్సిన్‌ ఇంకా ప్రారంభ దశలోనే ఉందని.. కానీ తాము దీన్ని పోలిన టీకాలను ఇప్పటికే అభివృద్ధి చేశామని.. అవి ఫ్లూ, ఎబోలాను నిరోధించవచ్చని వెల్లడించింది. కరోనా వైరస్‌ల నుంచి సేకరించిన జన్యు సంకేతాలను విశ్లేషించి ఈ కొత్త టీకాను తయారు చేశారు. వైరస్‌ల కుటుంబం రూపాంతరం చెందినా వాటి నుంచి రక్షణ లభించేలా సూపర్‌-యాంటీజెన్‌ లాగా రూపొందించారు.