Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • అమెరికాలో తెలుగు విద్యార్థి దారుణ హత్య..

    Author VENKATESH | 07 Jun 2026, 10:28 AM | TELANGANA
    అమెరికాలో తెలుగు విద్యార్థి దారుణ హత్య..

    అమెరికాలో ఉన్నత చదువులు, ఉద్యోగం కోసం వెళ్లిన ఒక హైద‌రాబాద్‌కి చెందిన యువకుడు దుండగుల చేతిలో దారుణ హత్యకు గురైన విషాదకర ఘటన ఫిలడెల్ఫియాలో చోటుచేసుకుంది. నార్త్ ఫిలడెల్ఫియాలోని ‘రేమండ్ రోసెన్ హోమ్స్’ హౌసింగ్ కాంప్లెక్స్‌లో డోర్‌డాష్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న 28 ఏళ్ల తెలుగు విద్యార్థి కుంచా అన్షుల్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 12:30 గంటల సమయంలో ఈ ఘోరం జరిగింది. దుండగులు పక్కా వ్యూహంతో ఒక ఖాళీగా ఉన్న ఇంటి అడ్రస్‌ను ఇస్తూ డెలివరీ ఆర్డర్ పెట్టి అన్షుల్‌ను అక్కడికి రప్పించారు. అతను ఆర్డర్ డెలివరీ చేసి తిరిగి వస్తుండగా, చాలా దగ్గర నుండి అతని తలపై కాల్పులు జరిపారు. తీవ్ర రక్తస్రావం కావడంతో అన్షుల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఖాళీగా ఉన్న ఆ ఇంటి లోపల మూడు అన్‌ఓపెన్డ్ పిజ్జా బాక్స్‌లు, ఒక డెలివరీ బ్యాగ్ లభించడాన్ని బట్టి అతను డెలివరీ పూర్తి చేసిన వెంటనే ఈ దాడి జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు.