Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై పోరుకు సిద్ధమైన బీజేపీ..

    Author VENKATESH | 07 Jun 2026, 06:10 PM | TELANGANA
    విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై పోరుకు సిద్ధమైన బీజేపీ..

    హైదరాబాద్: దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పాలనకు 12 ఏళ్లు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా జూన్ నెలంతా వివిధ అంశాలపై చర్చా కార్యక్రమాలకు బీజేపీ సిద్ధమైంది. ఈ మేరకు నేడు (ఆదివారం) తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు అధ్యక్షతన రాష్ట్ర కార్యాలయంలో పలు అంశాలపై చర్చలు కొనసాగుతున్నాయి. తొలుత గోదావరి, కృష్ణా నదీ జలాలు, ప్రాజెక్టులు, నీటి పారుదల రంగంపై నేతలు సమావేశమయ్యారు.
    ఈ సందర్భంగా ఆయా అంశాలపై టీవీ డిబేట్స్, ఇతర వేదికలపై మాట్లాడేలా నేతలకు రాంచందర్ రావు దిశానిర్దేశం చేశారు. ఈ ప్రత్యేక అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాంచందర్ రావు హాజరుకాగా.. రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు, మీడియా ప్యానలిస్టులు పాల్గొన్నారు. ఈ భేటీ అనంతరం రాంచందర్ రావు అధ్యక్షతన బీజేపీ పదాధికారుల సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీకి రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ అభయ్ పాటిల్, సంస్థాగత ఇన్‌ఛార్జ్ చంద్రశేఖర్ తివారి, పదాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకి అండగా నిలిచేందుకు మరో పోరుబాటకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం సిద్ధమైంది.
    ఈ సమావేశంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే యాక్షన్ ప్లాన్ గురించి చర్చించారు. ఇటీవల 'రైతు గోస-బీజేపీ భరోసా' పోరుబాటతో ప్రభుత్వం దిగొచ్చిందని, దీంతో తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని రాంచందర్ రావు అన్నారు. అలాగే విద్యార్థుల సమస్యలపైనా గట్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు. నేతలంతా ఐక్యంగా ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన సూచించారు.