Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • హార్మోన్ల అస‌మ‌తుల్య‌త వ‌ల్ల మ‌హిళ‌ల్లో ఎలాంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి.. ఏం చేయాలి..?

    Author VENKATESH | 09 Jun 2026, 12:49 PM | HEALTH
    హార్మోన్ల అస‌మ‌తుల్య‌త వ‌ల్ల మ‌హిళ‌ల్లో ఎలాంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి.. ఏం చేయాలి..?

    మొటిమలను చాలామంది కేవలం చర్మ సమస్యగా మాత్రమే భావిస్తారు. అయితే ఆరోగ్య నిపుణులు చెబుతున్న ప్రకారం, మొటిమలకు కారణం కేవలం చర్మంపై పేరుకుపోయే నూనె, దుమ్ము లేదా తగని సౌందర్య ఉత్పత్తులు మాత్రమే కావు. రక్తంలో చక్కెర స్థాయిల్లో వచ్చే హెచ్చుతగ్గులు, ఇన్సులిన్ నిరోధకత, హార్మోన్ల అసమతుల్యత కూడా మొటిమల సమస్య వెనుక కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా పీసీవోఎస్‌ (ప్రస్తుతం పీఎంఓఎస్‌ అని కూడా పిలుస్తున్నారు) వంటి సమస్యలతో బాధపడే మహిళల్లో ఈ సంబంధం మరింత స్పష్టంగా కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. పీఎంఓఎస్‌ కేవలం సంతానోత్పత్తి వ్యవస్థకు సంబంధించిన సమస్య మాత్రమే కాకుండా, ఇది ప్రధానంగా జీవక్రియలకు సంబంధించిన రుగ్మతగా మారింది. ఈ పరిస్థితిలో శరీర కణాలు ఇన్సులిన్‌కు సరిగా స్పందించకపోవడంతో రక్తంలో ఇన్సులిన్ స్థాయిలు పెరుగుతాయి. ఫలితంగా ఆండ్రోజెన్ హార్మోన్ల ఉత్పత్తి అధికమై హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. దీని ప్రభావంగా మొటిమలు, అధిక జిడ్డు చర్మం, అసమాన నెలసరి చక్రాలు వంటి సమస్యలు కనిపిస్తాయి.