Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • సిరాజ్‌కు విశ్రాంతి.. ప్రసిధ్‌కు చోటు

    Author VENKATESH | 10 Jun 2026, 12:42 PM | Sports
    సిరాజ్‌కు విశ్రాంతి.. ప్రసిధ్‌కు చోటు

    ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లకు టీమిండియా స్పీడ్‌స్టర్‌ మహమ్మద్‌ సిరాజ్‌ దూరం అయ్యాడు. భవిష్యత్‌ సిరీస్‌లను దృష్టిలో పెట్టుకుని సిరాజ్‌కు విశ్రాంతినిచ్చిన బీసీసీఐ..అతని స్థానంలో ప్రసిధ్‌ కృష్ణను ఎంపిక చేసింది. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌తో పాటు అఫ్గానిస్థాన్‌తో ఏకైక టెస్టు మ్యాచ్‌లో సిరాజ్‌ బరిలో దిగాడు. తన వర్క్‌లోడ్‌ మేనేజ్‌మెంట్‌ను పరిశీలించిన బీసీసీఐ మెడికల్‌ బృందం… టీమ్‌ మేనేజ్‌మెంట్‌తో చర్చించి ఈ నిర్ణయం తీసుకుంది.

    ఐర్లాండ్‌తో పాటు ఇంగ్లండ్‌తో సిరీస్‌లకు ఎంపిక చేసిన సెలెక్టర్లు..ఆసియా గేమ్స్‌కు సిరాజ్‌ను పరిగణనలోకి తీసుకోలేదు. చివరిసారి సొంతగడ్డపై జరిగిన టీ20 ప్రపంచకప్‌లో సిరాజ్‌..భారత్‌ తరఫున టీ20ల్లో ఆడాడు. ఈ నెల 26, 28న ఐర్లాండ్‌తో రెండు టీ20ల్లో తలపడే భారత్‌.. వచ్చే నెల 1 నుంచి ఇంగ్లండ్‌తో 5 టీ20 ఆడుతుంది.