Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఎయిర్ అరేబియా విమానం దారి మ‌ళ్లింపు..

    Author VENKATESH | 13 Jun 2026, 01:17 PM | INTERNATIONAL
    ఎయిర్ అరేబియా విమానం దారి మ‌ళ్లింపు..

    షార్జా నుంచి కోజికోడ్ చేరుకోవాల్సిన ఎయిర్ అరేబియా విమానాన్ని ఇవాళ దారి మ‌ళ్లించారు. ఆ విమానం కొచ్చిన అంత‌ర్జాతీయ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యింది. సాంకేతిక స‌మ‌స్య త‌లెత్త‌డం వ‌ల్ల దాన్ని దారి మ‌ళ్లించారు. ఎయిర్ అరేబియా ఫ్ల‌యిట్ జీ9 454 విమానంలోని ఇంజిన్ రివ‌ర్స్ త్ర‌స్ట్ సిస్ట‌మ్‌లో సాంకేతిక స‌మ‌స్య త‌లెత్తింద‌ని, దాని వ‌ల్ల దాన్ని కొచ్చిన్‌లో దించార‌ని కొచ్చిన ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ ప్ర‌తినిధి తెలిపారు.
    ప్రోటోకాల్ ప్ర‌కారం ఇవాళ తెల్ల‌వారుజామున కొచ్చిన్ విమానాశ్ర‌యంలో ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించారు. తెల్ల‌వారుజామున 3.38 నిమిషాల‌కు ఆ విమానం ల్యాండ్ అయ్యింది. 3.45 నిమిషాల త‌ర్వాత ఎమ‌ర్జెన్సీ ఎత్తివేశారు. అన్ని సేఫ్టీ చెక్స్‌ను నిర్వ‌హించిన‌ట్లు ప్ర‌తినిధి తెలిపారు. విమానాన్ని దారి మ‌ళ్లించిన స‌మ‌యంలో సుమారు 170 మంది ప్ర‌యాణికులు ఆ విమానంలో ఉన్న‌ట్లు తెలిసింది. వారిలో 9 మంది శిశువులు, సిబ్బంది కూడా ఉన్నారు.
    అంద‌రూ సుర‌క్షితంగా ఉన్న‌ట్లు అధికారులు చెప్పారు. దారి మ‌ళ్లిన విమానం వ‌ల్ల ఎయిర్‌పోర్ట్ ఆప‌రేష‌న్స్‌పై ఎటువంటి ప్ర‌భావం ప‌డ‌లేదు. సాంకేతిక లోపాన్ని స‌రిదిద్దిన త‌ర్వాత ఉద‌యం 7.15 నిమిషాల‌కు ఆ విమానాన్ని కోజికోడ్ పంపించారు.