Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఘనంగా ప్రపంచ సైకిల్ దినోత్సవం వేడుకలు

    Author VENKATESH | 13 Jun 2026, 06:07 PM | TELANGANA, నారాయణపేట
    ఘనంగా ప్రపంచ సైకిల్ దినోత్సవం వేడుకలు

    - సైకిల్ ర్యాలీని ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్ వాకిటి మానస హనుమంతు

    నారాయణపేట జిల్లా, జూన్ 13 (బివికే న్యూస్)


    సైకిలింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఖే లో ఇండియా, తెలంగాణ సైకిలింగ్ అసోసియేషన్ ఆదేశాల మేరకు, నారాయణపేట జిల్లా సైక్లింగ్ అసోసియేషన్, ప్రధాన కార్యదర్శి బి.గోపాలం ఆధ్వర్యంలో ప్రపంచ సైకిల్ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మక్తల్ మినీ స్టేడియం గ్రౌండ్ నుండి పురవీధుల గుండా ఘనంగా సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సైకిల్ ర్యాలీని మక్తల్ మున్సిపల్ చైర్పర్సన్ వాకిటి మానస,
    సైకలింగ్ అసోసియేషన్ చైర్మన్ మణికంఠ గౌడ్, ప్రధాన కార్యదర్శి బి.గోపాలంలు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరము కొత్త గార్లపల్లి రోడ్డులో బాలికలకు, మహిళలకు 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు సైకిల్ పోటీలను నిర్వహించారు. ఈ సైకిల్ పోటీలలో 200 మంది బాలికలు, మహిళలు పాల్గొన్నారు. గెలుపొందిన వారికి మెరిట్ సర్టిఫికెట్స్, మెడల్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, ఎస్సై రేవతి, డివైస్ ఓ వెంకటేష్ శెట్టి, సైకిలింగ్ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ మణికంఠ గౌడ్ జి. శివకుమార్, చిన్న అనుమంతు పిడీ,పీఈటిలు విష్ణువర్ధన్, ఈశ్వర్, మీనా కుమారి, రేణుక ,విశాలి, అమ్రేష్, దామోదర్, త్రివేణి, చంద్రకళ, వెంకటేష్, నవీన్, బాల్ రెడ్డి, కావలి ప్రవీణ్, మెడికల్ టీం మంజుల, జయమ్మ, 200 మంది మహిళలు ,బాలికలు పాల్గొన్నారు. ఈ సైకిల్ పోటీలలో పాల్గొన్న 200 మందికి డాక్టర్ మణికంఠ గౌడ్ భోజన వసతి కల్పించారు.

    ఇవి కూడా చదవండి