Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఆగి ఉన్న లారీని వెనుక నుండి ఢీకొట్టిన కారు

    Author VENKATESH | 14 Jun 2026, 07:08 PM | TELANGANA, నారాయణపేట
    ఆగి ఉన్న లారీని వెనుక నుండి ఢీకొట్టిన కారు

    - ఒకరు మృతి, నలుగురికి గాయాలు - మెరుగైన చికిత్స నిమిత్తం రైచూరుకు తరలింపు నారాయణపేట జిల్లా, జూన్ 14 (బి వి కే న్యూస్ ) నారాయణపేట జిల్లా కృష్ణమండలం గుడెబల్లూరు గ్రామ శివారులోని టైరోడ్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా నలుగురికి గాయాలు అయినాయి. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి రాయచూర్ కు చెందిన ఐదుగురు కర్ణాటక రాష్ట్రం కళబెళగుంది ఆలయంలో దైవ దర్శనానికి వెళ్లి తిరిగి రాయచూర్ కి వస్తున్న సందర్భంలో కృష్ణా మండలం గుడెబల్లూర్ సమీపంలో గల టైరోడ్ శివారులో TN 34 X 4377 నెంబర్ గల ఆగి ఉన్న లారీని KA 36 P 8390 నెంబర్ గల హుండాయ్ కారు వెనుక నుండి ఢీకొట్టడంతో కారులోని శేఖరప్ప అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మిగతా నలుగురు గాయపడినారు. గాయపడిన నలుగురిని స్థానికులు బయటకు తీసి మెరుగైన చికిత్స నిమిత్తం కర్ణాటకలోని రాయచూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్న వివరాలు తెలియవలసి ఉంది.