Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • బరువు తగ్గేందుకు "ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్" - వీరు మాత్రం అస్సలు చేయొద్దట!

    Author VENKATESH | 15 Jun 2026, 11:38 AM | HEALTH
    బరువు తగ్గేందుకు "ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్" - వీరు మాత్రం అస్సలు చేయొద్దట!

    ఈ రోజుల్లో చాలామంది బరువు తగ్గడానికి 'ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్' పద్ధతిని ఫాలోవుతున్నారు. అయితే, ఇలా డైటింగ్ చేసే ముందు మనం దానికి అర్హులమా? కాదా? అని తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు. ఇది అందరికీ సురక్షితం కాదని సూచిస్తున్నారు. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్తో కొత్త ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏంటి? ఎవరు ఈ పద్ధతిని అనుసరించాలి? తదితర అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం!

    ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌ అంటే : ఈ డైట్లో ఆహారంపై కాకుండా టైంకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. 16:8, 20:4 పద్ధతిని బాగా ఫాలో అవుతుంటారని నిపుణులు చెబుతున్నారు. అంటే 16 గంటలు లేదా 20 గంటలు ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఫాస్టింగ్ చేసి ఆ తర్వాత 8 గంటలు లేదా 4 గంటలు కడుపు నిండా తింటారని చెబుతున్నారు. ఆ తర్వాత మళ్లీ 16 లేదా 20 గంటలు ఉపవాసం ఉంటారని పేర్కొంటున్నారు. ఈ పద్ధతిలో కేలరీల గురించి చింతించాల్సిన అవసరం లేదని తెలియజేస్తున్నారు. ఏమైనా తినొచ్చట. ఆకలి, బరువును నియంత్రించడంలో ఈ డైట్ సహాయపడుతుందని వివరిస్తున్నారు. దీనివల్ల శరీర మెటబాలిజం మెరుగుపడుతుందట. ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌ బరువు తగ్గడానికి ప్రభావవంతంగా ఉంటుందని, 10 వారాలలో 7-11 పౌండ్ల బరువు తగ్గే అవకాశం ఉందని the nutrition source పేర్కొంది.