Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఇన్‌ఫ్లమేషన్‌" ఇబ్బంది పెడుతోందా? - ఈ ఫుడ్స్‌తో చెక్ పెట్టొచ్చట!

    Author VENKATESH | 15 Jun 2026, 11:45 AM | HEALTH
    ఇన్‌ఫ్లమేషన్‌" ఇబ్బంది పెడుతోందా? - ఈ ఫుడ్స్‌తో చెక్ పెట్టొచ్చట!

    కారణంగా డయాబెటిస్, కీళ్ల నొప్పులు, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. ఈ వ్యాధులన్నింటికి దీర్ఘకాలిక వాపు (క్రానిక్ ఇన్ఫ్లమేషన్) ప్రధాన కారణమంటున్నారు నిపుణులు. అయితే, మన వంటింట్లో దొరికే యాంటీ ఇన్ఫ్లమేషన్ గుణాలున్న వాటిని క్రమం తప్పకుండా తీసుకుంటే ఈ ముప్పు నుంచి తప్పించుకోవచ్చని సూచిస్తున్నారు. మరి, అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం!

    పసుపు : ఇది వంటలకు రంగు, రుచి కోసమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. పసుపులో ఉండే కర్కుమిన్ అనేది శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుందని చెబుతున్నారు. ఇది శరీరంలో వాపు కలిగించే ఎంజైములు, ప్రొటీన్లను అడ్డుకుంటుందని పేర్కొంటున్నారు. ఈ క్రమంలో వాపును అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్న ఎవరైనా తమ ఆహారంలో కొంత పసుపును చేర్చుకోవడం వల్ల ప్రయోజనం పొందవచ్చని hopkinsmedicine పేర్కొంది.