Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మ‌ళ్లీ తెర‌పైకి మ‌హేశ్ బాబు

    Author VENKATESH | 16 Jun 2026, 12:51 PM | సినిమా
     మ‌ళ్లీ తెర‌పైకి మ‌హేశ్ బాబు

    సూపర్ స్టార్ మహేశ్ బాబు, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో సినిమా రాబోతోందంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏషియన్ సినిమాస్ బ్యానర్‌పై ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.Movies
    మహేశ్ బాబు ప్రస్తుతం రాజమౌళితో చేస్తున్న ‘వారణాసి’, సందీప్ వంగా కమిట్ అయిన ‘స్పిరిట్’, ‘యానిమల్ పార్క్’ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత ఈ కాంబో సెట్ అయ్యే అవకాశం ఉందని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. నిజానికి వీరిద్దరి కలయికలో సినిమా రావడం ఇదే మొదటి ఆలోచన కాదు. గతంలో ఏషియన్ సినిమాస్ నిర్మాణంలోనే మహేశ్, సందీప్ వంగా కలిసి ‘డెవిల్’ అనే సినిమా చేయాల్సి ఉంది. ఆ సమయంలో ఇద్దరికీ ఈ నిర్మాణ సంస్థ అడ్వాన్స్‌లు కూడా ఇచ్చినట్లు సమాచారం. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. అప్పటి నుంచి ఈ ఇద్దరి కాంబినేషన్ కోసం టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. మహేశ్ ‘వారణాసి’ చిత్రం ముగిసిన తర్వాతే ఈ ప్రాజెక్ట్‌పై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరి నిజంగానే ఈ కాంబో సెట్ అవుతుందో లేదో చూడాలి