Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • హైవేపై కూలిన విమానం..

    Author VENKATESH | 17 Jun 2026, 01:07 PM | INTERNATIONAL
    హైవేపై కూలిన విమానం..

    అమెరికాలోని టెక్సాస్‌లో మంగళవారం రాత్రి విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఓ మినీ విమానం లారెడోలోని హైవేపై కుప్పకూలింది. కూలిన వెంటనే మినీ విమానంలో మంటలు చెలరేగాయి. దీంతో హైవేపై ఒక్కసారిగా అలజడి మొదలైంది. కొంతమంది విమానం నుంచి దూరంగా పారిపోయారు. మరికొంతమంది మాత్రం తమ మంచి మనసును చాటుకున్నారు. తమ వాహనాలను వదిలేసి మరీ మినీ విమానంలో చిక్కుకుపోయిన వారికి సాయం చేయడానికి పూనుకున్నారు. విమానం కాక్‌పిట్‌ను బద్దలు కొట్టారు.
    లోపల ఉన్న వారిని బయటకు తీసుకువచ్చారు. ఈ సంఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. ‘లారెడోలో దాదాపు రాత్రి 10 గంటల సమయంలో మినీ విమానం కుప్పకూలింది. ప్రమాదం జరిగిన సమయంలో మినీ విమానంలో ఆరుగురు వ్యక్తులు ఉన్నారు. వారిలో ఒకరు మృత్యువాతపడ్డారు. హైవేపై వెళుతున్న వాహనదారులకు గాయాలు అయ్యాయా అన్నది తెలియరావాల్సి ఉంది. ప్రమాదం నేపథ్యంలో హైవేను రెండు వైపుల నుంచి మూసి వేశాము’ అని తెలిపారు.