Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • సిరిసిల్ల బైపాస్‌ రోడ్డుపై కారు-డీసీఎం ఢీ..

    Author VENKATESH | 18 Jun 2026, 11:21 AM | రాజన్న సిరిసిల్ల
     సిరిసిల్ల బైపాస్‌ రోడ్డుపై కారు-డీసీఎం ఢీ..

    రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డుపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు.
    ప్రాథమిక సమాచారం ప్రకారం.. హైదరాబాద్ నుంచి జగిత్యాల వైపు వెళ్తున్న కారు, డీసీఎం వ్యాన్ సిరిసిల్ల బైపాస్‌పై ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న అభిషేక్ అక్కడికక్కడే మృతిచెందాడు. మరో ముగ్గురు గాయపడ్డారు. కారులో ప్రయాణిస్తున్న వారిది జగిత్యాలగా తెలుస్తోంది.Geographic Reference
    ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు, గాయపడిన వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.