Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఉత్కంఠభరిత మ్యాచ్​లో ఘానా విజయం- 8ఏళ్ల తర్వాత కొలంబియా గ్రాండ్ రీ ఎంట్రీ

    Author VENKATESH | 18 Jun 2026, 11:45 AM | Sports
    ఉత్కంఠభరిత మ్యాచ్​లో ఘానా విజయం- 8ఏళ్ల తర్వాత కొలంబియా గ్రాండ్ రీ ఎంట్రీ

    2026 ఫిఫా వరల్డ్కప్లో ఘనా బోణీ కొట్టింది. తాజాగా టొరంటో స్టేడియం వేదికగా పనామాతో జరిగిన మ్యాచ్లో 1-0 తేడాతో ఘానా జట్టు విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో కాలేబ్ యిరెంకి చివరి నిమిషంలో గోల్ కొట్టడంతో ఘనా జట్టుకు విజయం ఖరారైంది.

    వాస్తవానికి మ్యాచ్ ఆరంభంలోనే పనామా జట్టుకు గోల్ సాధించే అవకాశం వచ్చింది. ఆ జట్టు ఆటగాడు అమీర్ మురిల్లో కొట్టిన షాట్తో బంతి క్రాస్, ఏరియాలో ఉన్న సెసిలియో వాటర్‌మన్‌కు చేరింది. కానీ ఆ గోల్ను ప్రత్యర్థి జట్టు ఘానా గోల్ కీపర్ లారెన్స్ అటి జిగీ ఆ బంతిని సమర్థంగా అడ్డుకున్నాడు. దీంతో పనామా తొలి గోల్ నమోదు చేసే ఛాన్స్ కోల్పోయింది. ఆ తర్వాత కూడా పనామాకు మరో అవకాశం లభించింది. అటి జిగీ సరిగ్గా పంచ్ చేయని బంతి జియోవనీ రామోస్ కాళ్ల వద్దకు చేరగా, డిఫెండర్‌కు సమయం దొరికినా అతను కొట్టిన షాట్ గోల్ పోస్ట్‌పైనుంచి వెళ్ళిపోయింది. దీంతో ఫస్టాఫ్లోనే రెండుసార్లు పనామాకు ఛాన్స్ మిస్ అయ్యింది.