Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • విష్ణు ఆలయ రహస్యాలతో ‘నాగబంధం’

    Author VENKATESH | 20 Jun 2026, 10:55 AM | Cinema
    విష్ణు ఆలయ రహస్యాలతో ‘నాగబంధం’

    యువ నటుడు విరాట్ కర్ణ, గ్లామరస్ బ్యూటీ నభా నటేష్ జంటగా నటిస్తున్న సోషియో ఫాంటసీ అడ్వెంచర్ చిత్రం ‘నాగబంధం’ ట్రైలర్‌ను చిత్ర బృందం ఘనంగా విడుదల చేసింది. హైదరాబాద్‌లోని ప్రసాద్స్ పిసిఎక్స్ థియేటర్‌లో యూనిట్ సభ్యుల సమక్షంలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. అభిషేక్ పిక్చర్స్, ఎన్ఐకే స్టూడియోస్ పతాకాలపై కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు ఈ సినిమాతో దర్శకుడిగా మారారు.
    ట్రైలర్‌లో చూపించిన విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ తెలుగు సాంకేతిక నిపుణులే రూపొందించడం విశేషం. పురాతన ఆలయాలు, గ్రాఫిక్స్ విజువల్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మన పురాతన విష్ణు ఆలయాలు, వాటి వెనుక దాగి ఉన్న రహస్యాలు, సనాతన ధర్మం మరియు చారిత్రక అంశాల నేపథ్యంలో మైథాలజీ అడ్వెంచర్ స్పెక్టకిల్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాలో విరాట్ కర్ణ శివ తరహా మాస్ లుక్‌లో కనిపించనుండగా, చాలా రోజుల తర్వాత నభా నటేష్ పవర్‌ఫుల్ పాత్రలో మెరవబోతోంది. వీరితో పాటు ఐశ్వర్యా మీనన్, జగపతి బాబు, మహేష్ మంజ్రేకర్, మురళీ శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జునైద్ కుమార్ మరియు అబీ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌కు భారీ హైప్ తీసుకొచ్చింది.