Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • నాని ‘ది ప్యారడైజ్’ నుంచి రాఘవ్ జూయల్ ఫస్ట్ లుక్..

    Author VENKATESH | 20 Jun 2026, 11:04 AM | Cinema
    నాని ‘ది ప్యారడైజ్’ నుంచి రాఘవ్ జూయల్ ఫస్ట్ లుక్..

    స్టార్ న‌టుడు నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ చిత్రం ‘ది ప్యారడైజ్’ నుంచి మేకర్స్ క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. బాలీవుడ్ నటుడు రాఘవ్ జూయల్ ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆయన పుట్టినరోజు సందర్భంగా జూన్ చిత్ర బృందం ‘విక్రమ్ మాలిక్’ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఈ గ్లింప్స్‌లో రాఘవ్ జూయల్ పవర్‌ఫుల్ అండ్ అథారిటేటివ్ ‘విక్రమ్ మాలిక్’ పాత్రలో కనిపించారు. నిప్పులు, వాన, గందరగోళం మధ్య మెడలో భారీ గోల్డ్ చెయిన్స్‌తో కారుపై నుంచి దూకుతూ రగ్గడ్ అండ్ డేంజరస్ లుక్‌లో అదరగొట్టారు. “ఖాన్దాన్ కా షాన్, దోస్తోన్ కా జాన్.. విక్రమ్ మాలిక్ కి స్వాగతం సుస్వాగతం.. షెహర్ మేరా, నామ్ మేరా.. వెల్‌కమ్ టు జడల్ జమానా” అనే డైలాగ్ విక్రమ్ మాలిక్ పవర్‌ను చూపిస్తోంది. గ్లింప్స్ చివర్లో నాని ధగడ్ పాత్రలో, రాఘవ్ జూయల్ మధ్య వచ్చే ఫేస్ ఆఫ్ సీన్ థియేటర్లలో పూనకాలు తెప్పించేలా ఉంది. అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ క్యారెక్టర్ ఎలివేషన్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లింది.