Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఆరోగ్య ప్రదాత

    Author VENKATESH | 20 Jun 2026, 01:34 PM | కరీంనగర్
    ఆరోగ్య ప్రదాత

    సూర్య నమస్కారాలు
    తూర్పు కొండల వెనుక నుండి
    బంగారు కిరణాల భానుడు రాగా
    మేల్కొన్న ప్రకృతి పులకించగా
    మొదలవుతుంది ఆరోగ్యయోగం
    ద్వాదశ రూపాల ఆసన విన్యాసం
    దేహానికి ఇచ్చును నవవికాసం
    శ్వాసపై ధ్యాస నిలిపి చేస్తే
    దూరమగను మానసిక ఆయాసం
    మాయమవును కుంగుబాటు
    ప్రణామ ఆసనంతో మొదలై
    భుజంగాసనంతో బలమునిచ్చి
    పాదహస్తాసన భంగిమలతో
    వెన్నెముకను నిటారుగా నిలిపి
    హార్మోన్ల సమతుల్యతతో
    ఉల్లాసం ఉత్సాహం హుషారు
    పెరుగును వ్యాకులత తగ్గును
    సూర్య నమస్కారాలతో
    శారీరక మానసిక ఆధ్యాత్మిక
    సమతుల్యత చేకూరుతుంది
    సూర్య నమస్కారాలు
    శరీరాన్ని లోపల నుండి
    శుద్ధి చేసే సంపూర్ణ ప్రక్రియ
    సూర్యనమస్కారాల వల్ల అనేక
    ఆరోగ్య ప్రయోజనాలు సిద్ధిస్తాయి
    శరీరం మొత్తం కదలికల
    వల్ల పొట్ట నడుము భాగాల్లో
    ఉన్న అదనపు కొవ్వు కరిగి
    బరువు తగ్గును జీర్ణక్రియ
    మెరుగుపడును మలబద్ధకం
    వంటి సమస్యలు తొలగి
    జీర్ణశక్తి పెరుగుతుంది
    రక్తప్రసరణ శరీరంలో
    ప్రతి భాగానికి ఆక్సిజన్ తో
    కూడిన రక్తం సరఫరా అవుతుంది
    వెన్నెముఖదృడత్వంపెరుగుతుంది
    నడుము నొప్పులను నివారిస్తుంది
    కండరాల పుష్టి చేతులు కాళ్లు
    చాతి మరియు భుజాల
    కండరాలు బలపడి శరీరం
    దృఢంగా మారుతుంది
    నరాల వ్యవస్థ శాంతించి
    మానసిక ఒత్తిడి ఆందోళన
    తగ్గును శ్వాసపై దాసపెట్టడంవల్ల
    జ్ఞాపక శక్తి ఏకాగ్రత పెరుగును
    మనసు ప్రశాంతంగా మారడం
    వల్ల మంచి నిద్ర వచ్చును

    గుండె కండరాలను
    బలోపేతం చేస్తుంది
    హార్మోన్ల సమతుల్యత
    థైరాయిడ్ వంటి అంతర్గత
    గ్రందులపని తీరు మెరుగవుతుంది
    ముఖ్యంగా మహిళల్లో
    రుతు చక్రం క్రమబద్ధీకరణకు
    సహాయపడుతుంది
    చర్మ సౌందర్యం రక్తప్రసరణ
    పెరిగి చెమట ద్వారా టాక్సిన్స్ (విషయపదార్థాలు)
    బయటికి పోవడం వల్ల చర్మం
    కాంతివంతంగా మారుతుంది
    క్త ప్రసరణ వేగవంతమవుతుంది
    జఠరాగ్ని చక్కగా వెలుగుతుంది
    నరాల బలహీనత
    మాయమై కండరాలకు
    పుష్టి చేకూరుతుంది
    ఆలస్యాన్ని తరిమికొట్టి
    ఉత్సాహాన్ని నింపే శక్తి
    కాయాన్ని కల్పవృక్షం చేసే
    అద్భుతమైన దివ్యౌషధం
    సూర్య నమస్కారాలు

    సూర్య నమస్కారాలు నిత్యం
    చేద్దాం ఆరోగ్య భారతన్నినిర్మిద్దాం
    ఆదిత్యుని కరుణాకటాక్షంతో
    నూరేళ్ల ఆయుష్షును పొందుదాం
    (జూన్21 న అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా)
    నేదునూరి కనకయ్య
    అధ్యక్షులు
    తెలంగాణ ఎకనామిక్ ఫోరం
    మాజీ ఎన్ ఎస్ ఎస్ అధికారి
    కాలమిస్ట్ రచయిత
    కరీంనగర్9440245771

    ఇవి కూడా చదవండి