Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • బండి భగీరథ్ కు మల్కాజ్ గిరి కోర్టులో ఊరట..!

    Author VENKATESH | 20 Jun 2026, 02:38 PM | TELANGANA
    బండి భగీరథ్ కు మల్కాజ్ గిరి కోర్టులో ఊరట..!

    మైనర్ బాలికను లైంగికంగా వేధించిన వ్యవహారంలో పోక్సో కేసు కింద అరెస్ట్ అయి జైల్లో ఉన్న కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కు ఇవాళ మల్కాజ్ గిరి కోర్టులో ఊరట లభించింది. సెమిస్టర్ పరీక్షలు రాసేందుకు వీలుగా తనకు తాత్కాలిక బెయిల్ మంజూరు చేయాలని ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్ ను విచారించిన మల్కాజ్ గిరి కోర్టు సానుకూలంగా స్పందించింది. దీంతో ప్రస్తుతానికి ఆయనకు ఊరట లభించింది. 100 రోజుల్లోపే రూ.840 కోట్లు నిధులు.. మాట తప్పలేదన్న బండి సంజయ్ ఈ కేసులో ఆరోపణలు వచ్చిన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన బండి భగీరథ్ ను పోలీసులు గత నెల 16న అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్ కు పంపారు. ఆ తర్వాత తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ భగీరథ్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు ఈ పిటిషన్ ను తోసిపుచ్చింది. దీంతో జైల్లోనే గడుపుతున్న ఆయన.. తాజాగా మల్కాజ్ గిరి కోర్టులో తాత్కాలిక బెయిల్ కు పిటిషన్ దాఖలు చేశారు. సెమిస్టర్ పరీక్షల కోసమని ఇందులో కారణం చూపారు.