Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • జిల్లా ఒలంపిక్ డే రన్ నిర్వహణ కమిటీ చైర్మన్ బి.గోపాలం ఆధ్వర్యంలో...

    Author VENKATESH | 21 Jun 2026, 06:07 PM | నారాయణపేట
    జిల్లా  ఒలంపిక్ డే రన్ నిర్వహణ కమిటీ చైర్మన్ బి.గోపాలం ఆధ్వర్యంలో...

    - మక్తల్ లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు

    నారాయణపేట, జూన్ 21 ( బి వి కే న్యూస్ )


    తెలంగాణ రాష్ట్ర ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఏపీ. జితేందర్ రెడ్డి ,పి. మల్లారెడ్డి ఆదేశాల మేరకు ఇంటర్నేషనల్ ఒలంపిక్ డే ను పురస్కరించుకొని, నారాయణపేట జిల్లా ఒలంపిక్ డే రన్ నిర్వహణ కమిటీ చైర్మన్ బి.గోపాలం ఆధ్వర్యంలో ఆదివారం ఉదయము 7 గంటలకు మక్తల్ మినీ స్టేడియం గ్రౌండ్ నుండి పురవీధుల గుండా 250 మంది క్రీడాకారిణులు, క్రీడాకారులు అంతర్జాతీయ ఒలంపిక్ దినోత్సవం ప్రాముఖ్యతను ప్రజల్లో అవగాహన కల్పించుటకు ఘనంగా ఒలంపిక్ డే పరుగును నిర్వహించారు.
    ఈ ఒలంపిక్ డే పరుగును డాక్టర్ మణికంఠ గౌడ్, బి.గోపాలం క్రీడాజ్యోతిని వెలిగించి ప్రారంభించారు. అనంతరం స్టేడియం గ్రౌండ్లో జరిగిన సమావేశంలో బి.గోపాలం, డాక్టర్ మణికంఠ గౌడ్ మాట్లాడుతూ ఆధునిక ఒలంపిక్ క్రీడల వ్యవస్థాపకుడు డి కూ బర్టన్ ద్వారా 1948 జూన్ 23 నుండి ప్రపంచమంతట ప్రతి సంవత్సరం జూన్ 23న ఒలంపిక్ డే పరుగును నిర్వహించుకుంటున్నామని, క్రీడల ద్వారా ప్రజలను ఏకతాటిపైకి తేవడం, శాంతిని పెంపొందించడం, చురుకైన జీవనశలిని ప్రోత్సహించడము, ఆత్మవిశ్వాసాన్ని నింపడం, ఒలంపిక్ విలువలైన శ్రేష్టత, గౌరవము, స్నేహము ,ఐక్యత, సంఘీభావము, పట్టుదల, క్రీడల పట్ల ఆసక్తిని పెంచడం, క్రీడలలో గెలవడం కాదు పాల్గొనడమే ముఖ్యం. జీవితములో జయించడం కాదు పోరాడటమే ముఖ్యం. ప్రయత్నించకపోతే గెలువ లేరని. క్రీడలలో క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని వారు తెలిపారు. ఒలంపిక్ డే పరుగును విజయవంతం చేసినందుకు పాల్గొన్న ప్రతి ఒక్కరికి బి.గోపాలం కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జాతీయస్థాయి 50 మంది క్రీడాకారిణులను, పీఈటీలను మెడల్స్ శాలువాతో ఘనంగా సన్మానించి అభినందించారు.
    ఈ కార్యక్రమంలో బి.గోపాలం, తాన్ సింగ్, డాక్టర్ మణికంఠ గౌడ్, కోళ్ల వెంకటేష్ ,జి. శివకుమార్ ,వాకిటి హనుమంతు, రహీం పటేల్, హెచ్ఎం కురుమయ్య, తాయప్ప, అంబదాస్, రవూప్, మూర్తి, పిడి, పీఈటీలు అమ్రేష్, దామోదర్, స్వప్న, రమ్య, చంద్రకళ, అవంతి, రేణుక, శ్రీనివాస్, 250 మంది బాలబాలికలు పాల్గొన్నారు.

    ఇవి కూడా చదవండి