Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • 30 కిలోల అడవి జంతువుల మాంసం పట్టివేత..

    Author VENKATESH | 22 Jun 2026, 12:19 PM | TELANGANA
    30 కిలోల అడవి జంతువుల మాంసం పట్టివేత..

    మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని కాకతీయనగర్‌లో అడవి జంతువుల మాంసం విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో అటవీశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అయితే అధికారుల రాకను గమనించిన కొందరు స్మగ్లర్లు అక్కడి నుంచి పరారయ్యారు.
    అధికారుల తనిఖీ సమయంలో మాంసం విక్రయిస్తున్న ఒక వ్యక్తిని అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌తో వేటగాళ్లు వాగ్వాదానికి దిగారు. పరిస్థితిని అదుపులోకి తీసుకున్న అధికారులు విచారణ చేపట్టారు. అధికారుల తనిఖీల్లో సుమారు 30 కిలోల అడవి జంతువుల మాంసంతో పాటు ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.