Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఐపీఎల్‌లో ట్రేడ్ డీల్: రాజస్థాన్ రాయల్స్‌కు హార్దిక్ పాండ్య!

    Author VENKATESH | 22 Jun 2026, 02:13 PM | Sports
    ఐపీఎల్‌లో ట్రేడ్ డీల్: రాజస్థాన్ రాయల్స్‌కు హార్దిక్ పాండ్య!

    ఐపీఎల్‌లో మరో భారీ ట్రేడ్ చర్చలు క్రికెట్ వర్గాల్లో సంచలనం రేపుతున్నాయి. ముంబై ఇండియన్స్ కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య జట్టును వీడే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. రాజస్థాన్ రాయల్స్ జట్టు హార్దిక్‌ను తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ప్రతిగా ఆర్ఆర్ యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ ముంబైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఇరు ఫ్రాంచైజీల మధ్య చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
    ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన సంగతి తెలిసిందే. దీంతో జట్టులో భారీగా మార్పులు చేయడానికి ఫ్రాంచైజీ సిద్ధమైనట్లు సమాచారం. అందులోనూ హార్దిక్ పాండ్య ముంబై కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అతడిపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. డ్రెస్సింగ్ రూమ్‌లో అసంతృప్తి, అంతర్గత విభేదాల కారణంగా హార్దిక్ ఒత్తిడి గురవుతున్నట్లు తెలుస్తోంది. స్వయంగా అతడే జట్టును వీడాలని నిర్ణయించుకున్నట్లు క్రికెట్ వర్గాల సమాచారం. మరోవైపు సూర్యకుమార్ యాదవ్ సహా పలువురు సీనియర్ ప్లేయర్ల విషయంలోనూ ట్రేడ్ చర్చలు జరుగుతున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.