Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • సీఎం రేవంత్ ను విమర్శించే అర్హత.. మాజీ ఎమ్మెల్యే చిట్టెంకు లేదు

    Author VENKATESH | 22 Jun 2026, 05:56 PM | నారాయణపేట
    సీఎం రేవంత్ ను విమర్శించే అర్హత.. మాజీ ఎమ్మెల్యే చిట్టెంకు లేదు

    - తమ నాయకుడు మంత్రి వాకిడి శ్రీహరి రోజుకు 20 గంటలు పని చేస్తున్నారూ

    - ప్రతిరోజు వెల్లువలా... ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాలు..

    - పూర్తిస్థాయి రైతుల పక్షపాతి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం...

    - పత్రికా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు...


    నారాయణపేట, జూన్ 22 ( బి వి కే )

    ఇవి కూడా చదవండి

    సీఎం రేవంత్ రెడ్డి ని విమర్శించే అర్హత, స్థాయి... మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి కి లేదని, తన పాలనలో రోజుకు మూడు నాలుగు గంటలు తిరగలేని రామ్మోహన్ రెడ్డి నేడు తమ నాయకుడు నిరంతరం రోజుకు 20 గంటలు తిరుగుతున్న విషయం ఏ సామాన్యమైన ప్రజానీకానికి అడిగిన చెబుతారని మక్తల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తేల్చి చెప్పారు. సోమవారం మక్తల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గణేష్ కుమార్, సీనియర్ నాయకులు కట్ట సురేష్ కుమార్ గుప్తలు మాట్లాడుతూ...

    కేసీఆర్ కాలిగోటికి సీఎం రేవంత్ రెడ్డి సరిపోరని మాజీ ఎమ్మెల్యే చిట్టెం అన్నారని... అయితే కేసీఆర్ సీఎం కుర్చీ ని అదే కాలిగోటితోనే పెకలించి దూరం చేసిన విషయం మర్చిపోయారా , అదే సీఎం కుర్చీలో రేవంత్ రెడ్డి కూర్చున్నా దృశ్యాలను చూడలేకపోతున్నారా అని అన్నారు.
    ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం గా ఒక రైతు బిడ్డ అంచలంచలుగా ఎదుగుతూ ముందుకొచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నా వాటిని బీఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు . ప్రతి రోజూ సీఎం గా రివ్యూలు, అభివృద్ధి పనుల్లో పాల్గొంటారని, ఫాం హౌస్ కు పరిమితం కాలేదని అన్నారు.
    మంత్రి వాకిటి శ్రీహరి రోజుకు 20 గంటలు పని చేస్తూ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన 18 రోజుల్లో సంగంబండ బండరాయి పగలగొట్టి 20పైగా గ్రామాలకు సాగునీరు అందించిన అపర బహిరతులు తమ నాయకుడు వాకిడి శ్రీహరి అని అన్నారు. మూడుసార్లు ఎమ్మెల్యే, 18 సంవత్సరాలు అధికారంలో ఉన్న రామ్మోహన్ రెడ్డి.
    సంగంబండ బండరాయి పగలగొట్టలేని దుస్థితిని తీసుకొచ్చి రైతులకు వెన్నుపోటు పొడిచిన విషయం ఎవరికీ తెలియదా అంటూ విమర్శించారు. ఆగమేఘాలమీద ఎన్నికల సమయంలో ఆసుపత్రి కి శంకుస్థాపన చేసి తట్టేడు మట్టి తీయలేదని రామ్మోహన్ రెడ్డి నేడు ఎంతో సుందరంగా వేగవంతంగా ఆసుపత్రి పనులు సాగుతున్న దృశ్యాలు చూడడానికి మనసు ఉప్పుట లేదా అన్నారు. మంత్రి వాకిటి శ్రీహరి సహకారంతో 150 పడకల ఆసుపత్రి పనులు శరవేగంగా జరుగుతున్నాయని దసరాలోపు ఆసుపత్రిని ప్రారంభించేందుకు కృషి చేస్తున్నారని అన్నారు.
    ఇంటిగ్రేటెడ్ స్కూల్, ఆత్మకూరు గద్వాల మధ్య కృష్ణా నదిపై నూతన బ్రిడ్జి, పలు గ్రామాల వద్ద బ్రిడ్జిలు, అనేక గ్రామాలకు బీటీ రోడ్లు, సిసి రోడ్లు... ఇలానే అభివృద్ధి పనులతో మంత్రి వాకిటి శ్రీహరి అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారని అన్నారు.
    నియోజవర్గానికి దాదాపు 3500 ల ఇందిరమ్మ ఇండ్లు వచ్చాయని... ఒక మక్తల్ పట్టణంలోనే 350 ఇండ్ల పనులు జరుగుతున్నాయని... ప్రతిరోజు వెల్లువలా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు జరుగుతున్నాయని అన్నారు. గృహప్రవేశాలు పూర్తయిన వారి దగ్గరకు వెళ్లి బిల్లులు వచ్చాయా లేదో తెలుసుకోవాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెంకు సూచించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. బిఆర్ఎస్ హయాంలో నియోజకవర్గం లో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అయినా కట్టారా ఇసుక డంపింగ్ చేశారు దండుకొని పోయారు అని అన్నారు .

    రైతు రుణమాఫీ ని పూర్తి చేసి, రైతులకు మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ అందిస్తున్న ఏకైక సీఎం రేవంత్ రెడ్డి అని కొనియాడారు. రికార్డు స్థాయిలో 80 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారని, గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో ధాన్యం కొనుగోలు చేయలేదని తెలిపారు. గతంలో సీఎం కేసీఆర్ కేంద్రం వడ్లు కొనుగోలు చేయకపోతే.. తాము ఒక్క గింజ కొనుగోలు చేయబోమని చెప్పిన సంగతిని గుర్తు చేసుకోవాలని చిట్టెం కు సూచించారు.

    రైతులకు యూరియా కోసం రేవంత్ రెడ్డి మంత్రి వాకిటి శ్రీహరి ఇప్పటికే కేంద్ర మంత్రులతోపాటు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తో రివ్యూ నిర్వహించి.. నియోజకవర్గానికి తగినంత స్థాయిలో యూరియాను సిద్ధం చేసి ఉంచారని తెలిపారు. మక్తల్ రైల్వే స్టేషన్లో ఎరువుల రేక్ పాయింట్ ను ఏర్పాటు చేయాలని కోరుతూ ఇప్పటికే కేంద్ర మంత్రులను ,సీఎంను .. మంత్రి వాకిటి శ్రీహరి కలిసిన సందర్భాన్ని గుర్తు చేశారు. యూరియా సరఫరా లో కేంద్ర ప్రభుత్వానికే సర్వ హక్కులు ఉంటాయని గుర్తు చేశారు. ఏనాడైనా మక్తల్ నియోజకవర్గం అభివృద్ధి విషయంలో అసెంబ్లీలో నోరిపి మాట్లాడిన దాఖలాలు ఉన్నాయా అంటూ అన్నారు.

    గత ప్రభుత్వంలో అక్రమ ఇసుక, ఒండ్రు మట్టి రవాణా కు అడ్డు అదుపు లేకుండా పోయిందని అన్నారు. విమర్శల విషయంలో ఇప్పటికైనా మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పద్ధతి మార్చుకొని విమర్శలు మానుకోవాలని, లేకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
    పత్రికా సమావేశంలో
    మక్తల్ మున్సిపల్ చైర్మన్ వి.మానస హనుమంతు, మండల పరిషత్ మాజీ అధ్యక్షులు బి.చంద్రకాంత్ గౌడ్, కోఆప్షన్ సభ్యులు వల్లంపల్లి లక్ష్మణ్, బుక్క శంషుద్దీన్ ,మక్తల్ టౌన్ ప్రెసిడెంట్ ఏ. రవికుమార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ శాలం బిన్ ఉమర్ , ఫయాజ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు నీలప్ప, నీల గౌడ్, శంకర్ ,ఓబులేష్, గుడెబల్లూర్ నాగరాజ్, ఉస్సాముద్దీన్, మంజూరు ఇలాహి,NSUI నియోజకవర్గం అధ్యక్షులు అఫ్రోజ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వి.భాస్కర్, రవి, చిట్యాల అశోక్, తదితరులు పాల్గొన్నారు.