Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • తగ్గిన గోల్డ్, సిల్వర్​ రేట్లు - జూన్​ 23న ఏపీ, తెలంగాణలో తులం ధర ఎంత ఉందంటే?

    Author VENKATESH | 23 Jun 2026, 12:18 PM | BUSINESS
    తగ్గిన గోల్డ్, సిల్వర్​ రేట్లు - జూన్​ 23న ఏపీ, తెలంగాణలో తులం ధర ఎంత ఉందంటే?

    బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి గుడ్ న్యూస్​. మంగళవారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. అయితే అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకుంటున్న మార్పులు, డాలర్‌ కదలికలు, పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ ప్రభావంతో విలువైన లోహాల ధరలు రోజువారీగా హెచ్చుతగ్గులకు లోనవుతూనే ఉన్నాయి.

    క్యాప్స్‌ గోల్డ్‌ వెబ్‌సైట్‌ వెల్లడించిన వివరాల ప్రకారం, మంగళవారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,49,715గా నమోదైంది. గత ట్రేడింగ్‌ సెషన్‌లో ఈ ధర రూ.1,50,270 ఉండగా, ఒక్కరోజులోనే రూ.555 వరకు తగ్గింది. హైదరాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరు, ముంబయి, బెంగళూరు మార్కెట్లలో కూడా ఇదే ధర కొనసాగుతోంది. నగల తయారీలో విస్తృతంగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర దాదాపు స్థిరంగా ఉంది. సోమవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,34,040గా ఉండగా, మంగళవారం రూ.290 తగ్గి రూ.13,375కు చేరుకుంది.

    భారీగా తగ్గిన వెండి ధరలు
    మంగళవారం వెండి ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరు మార్కెట్లలో సోమవారం కిలో వెండి ధర రూ.2,41,999గా నమోదైంది. కాగా మంగళవారం కిలో వెండి ధర రూ.2,34,650కి చేరుకుంది. ఒక్కరోజులోనే దాదాపు రూ.7,349 మేర తగ్గింది.

    ఇవి కూడా చదవండి

    అక్షయ తృతీయ రోజు తప్పకుండా బంగారం కొనాలా?
    అక్షయ తృతీయ నాడు బంగారం కొనడం తప్పనిసరి కాదు, కానీ శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజు బంగారం కొనడం వల్ల తరగని ఐశ్వర్యం, లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని నమ్మకం. కేవలం బంగారం మాత్రమే కాదు వెండి, వజ్రాలు, ఇల్లు, వాహనం కొనడం, కొత్త పనులు, పెట్టుబడులు ప్రారంభించడం కూడా మంచి ఫలితాలను ఇస్తుందని నమ్మకం.