Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • క్యాన్సర్​ జీవితానికి ఆఖరి మజిలీ కాకూడదు : నటీమణులు గౌతమి, మమతా మోహన్​దాస్

    Author VENKATESH | 23 Jun 2026, 12:20 PM | TELANGANA
    క్యాన్సర్​ జీవితానికి ఆఖరి మజిలీ కాకూడదు : నటీమణులు గౌతమి, మమతా మోహన్​దాస్

    క్యాన్సర్ మహమ్మారి సోకితే జీవితంలో అంతా కోల్పోయినట్టే అని ఎందరో భావిస్తుంటారు. వ్యాధి నిర్ధారణ అయినప్పటి నుంచే జీవితం పట్ల ఆసక్తి, రేపటి పట్ల భరోసాని కోల్పోతారు. అయితే క్యాన్సర్‌తో పోరాడి కొత్త జీవితాన్ని ఆస్వాదించవచ్చని నిరూపించారు ఆ ఇద్దరు నటీమణులు. అంతే కాదు, తమ అనుభవాలను బాధితులతో పంచుకుని క్యాన్సర్ రోగుల్లో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేస్తున్నారు. వారే నటి గౌతమి, మమతా మోహన్ దాస్. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి సిల్వర్‌ జూబ్లీ ముగింపు వేడుకల్లో పాల్గొన్న వారు, తమ క్యాన్సర్ ప్రయాణాన్ని పంచుకున్నారు.

    క్యాన్సర్ జీవితానికి ఆఖరి మజిలీ కాకూడదు : బసవతారకం ఆసుపత్రి రజతోత్సవాల్లో నటి గౌతమి పాల్గొన్నారు. స్వయంగా క్యాన్సర్‌ను జయించిన సినీ నటి, తన అనుభవాలను పంచుకున్నారు. క్యాన్సర్ ఎంతో ఘోరమైన జబ్బే అయినప్పటికీ, అదే మన జీవితానికి ఆఖరి మజిలీ కాకూడదన్నారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి క్యాన్సర్ రోగులకు విశేష సేవలు అందించడంతో పాటు వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేస్తోందని అభినందించారు.