Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఆదాయానికి మించి ఆస్తుల వ్యవహారం - ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఇంట్లో ఏసీబీ సోదాలు

    Author VENKATESH | 23 Jun 2026, 05:17 PM | TELANGANA
    ఆదాయానికి మించి ఆస్తుల వ్యవహారం - ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఇంట్లో ఏసీబీ సోదాలు

    నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. నిజామాబాద్​లోని వారి నివాసంతో పాటు హైదరాబాద్ మచ్చబొల్లారంలోని ఇంట్లోనూ తనిఖీలు జరిగాయి. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలపై ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లలోనూ దాడులు జరిగాయి.రూ.3 కోట్లు విలువ చేసే ఆస్తులు గుర్తింపు : మల్లారెడ్డి ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించడంతో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. దాదాపు రూ.3 కోట్లు విలువ చేసే ఆస్తులను గుర్తించారు. అదనంగా మల్లారెడ్డి ఇంట్లో రూ.3.30 లక్షల నగదు, రూ.50 వేల బ్యాంకు బ్యాలెన్స్, మూడు బ్యాంకు లాకర్లను గుర్తించారు. 4 ఇళ్లు, వాణిజ్యభవనం, 8 ఇళ్ల స్థలాలు 10.3 ఎకరాల భూమిని అధికారులు గుర్తించారు. మల్లారెడ్డి ఇళ్లు, బంధువులు, స్నేహితుల ఇళ్లు మొత్తం 11 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. మల్లారెడ్డిని అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం హైదరాబాద్​కు తరలించినట్లు సమాచారం.