Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • సత్య వార్ గ్రామం లో విజయవంతమైన ఉచిత కంటి వైద్య శిబిరం...

    Author VENKATESH | 23 Jun 2026, 07:24 PM | నారాయణపేట
    సత్య వార్ గ్రామం లో విజయవంతమైన ఉచిత కంటి వైద్య శిబిరం...

    - వాకిటి శ్రీహరి అన్న సేవ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఏ రవికుమార్

    నారాయణపేట, జూన్ 23 (బివికె న్యూస్)

    తెలంగాణ రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి సహకారంతో, వాకిటి శ్రీహరి అన్న సేవా సమితి, పాలమూరు రాంరెడ్డి కంటి ఆసుపత్రి, సత్య వార్ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల సహకారంతో... మంగళవారం గ్రామంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతమైందని వాకిటి శ్రీహరి అన్న సేవా సమితి వ్యవస్థాపకులు అల్కూరి రవికుమార్ తెలిపారు.
    సత్య వార్ సర్పంచ్ సత్య రెడ్డి శ్రీహరన్న సేవా సమితి సభ్యులు మొహమ్మద్ నూరుద్దీన్ గార్లు ఉచిత కంటి వైద్య శిబిరం ప్రారంభించగా... సుమారు 60మంది వరకు ఉచిత కంటి పరీక్షలు చేపట్టగా.. దాదాపు 25మంది వరకు శస్త్ర చికిత్స కోసం రాంరెడ్డి కంటి ఆసుపత్రి కి తరలించామని అన్నారు.

    ఇవి కూడా చదవండి

    వాకిటి శ్రీహరి అన్న సేవాసమితి ఆధ్వర్యంలో ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా చాలా గ్రామాల్లో ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించి, వేలాది మందికి ఉచిత కంటి శస్త్ర చికిత్సలు చేపట్టామని చెప్పారు. సహకరించిన మంత్రి వాకిటి శ్రీహరికి లబ్దిదారులు ధన్యవాదాలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు , వార్డు సభ్యులు , వైద్య సిబ్బంది, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.