Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఓ మనిషి సతి లేని పతి జీవితం వెలుతురు లేని ఇల్లు

    Author VENKATESH | 24 Jun 2026, 03:41 PM | కరీంనగర్
    ఓ మనిషి సతి లేని పతి జీవితం వెలుతురు లేని ఇల్లు

    (సతి లేని పతి జీవితం
    అధోగతే అన్న అంశంపై
    స్పందిస్తూ రాసిన కవిత)
    మనిషి జీవితం
    వివాహంతో
    మొదలౌతుంది
    మూడుముళ్లతో
    సతి పతి బంధం
    ఏర్పడుతుంది
    సృష్టిలో తీయనిది
    సతి పతుల బంధం
    అగ్ని సాక్షిగా అడుగులేసి
    నూరేళ్ళ ప్రయాణానికి
    భాషలు చేసి కష్టాల
    కడలిని ఈదుతూ
    సంసార సాగరంలో
    తోడుగా సాగే
    అనురాగ గీతం
    సుఖ దుఃఖాల్లో
    భాగస్వాములై
    సంతాన సౌభాగ్యమే
    సంపదగా సంతృప్తియే
    జీవిత పరమావధిగా
    జీవిస్తున్న కాలంలో
    సతిని అకాల మృత్యువు
    కభలిస్తే తీవ్ర కలతచెంది
    మనస్థాపానికి గురైన
    పతికి ఒంటరి తనమే
    తోడైంది నీడైంది
    పరాథీనతే పెన్నిదైంది
    సతిలేని పతి జీవితం
    దిక్కుతోచని ఒక అరణ్యం
    అండగా నిలిచే దీపం
    ఆరిపోతే మిగిలేది
    చీకటి సామ్రాజ్యమే
    ఆమె ఉన్నపుడు ఇల్లు
    ఒక నందనవనం
    ఇల్లంతా సందడి
    ఆమె వెళ్ళాక మిగిలింది
    స్మశాన నిశ్శబ్దం
    వండిపెట్టే చేతులు దూరమై
    ఆకలి తీరక అల్లాడుతోంది
    పతిప్రాణం తోడులేక
    దిక్కు తోచని దిగులుతో
    బిక్కు బిక్కు మని జీవితాన్ని
    గడుపుతాడు
    నువ్వు లేని ఇల్లు ఇప్పుడు
    కేవలం నాలుగు గోడల శూన్యం
    నీవు నడచిన చోటల్లా
    కదలాడుతోంది నీ జ్ఞాపకాల
    నీడలు జాడలు
    గుర్తుకొస్తున్నాయి
    నీమాటలు నీసూచనలు
    గోడకు వేలాడే నీచిత్రపటం
    నన్ను చూసి నవ్వుతున్నట్లే
    ఉంటుంది కాని పలకరిస్తే
    పలుకని ఆ మౌనం నాగుండెను
    పిండేస్తూ ఉంటుంది
    నాడు చేతిలో చెయ్యేసి నడిచావు
    నేడు నన్ను ఒంటరి బాటసారిని
    చేశావు అందరు ఉండి
    అనాథనైనాను
    నా నవ్వుల్లో సగమై నిలిచావు
    నా కన్నీటి చుక్కల్లో మిగిలావు
    పండుగ అయిన పబ్బమైన
    నువ్వు లేని లోటు స్పష్టంగా
    తెలుస్తోంది
    రోజులు గడుస్తున్నా
    క్యాలెండర్లో సంవత్సరాలు
    మారుతున్న నీ స్థానం
    నా మదిలో పదిలం
    మళ్ళీ జన్మంటూ ఉంటే
    నీతోనే నా ప్రయాణం
    చిన్న అనారోగ్యం వచ్చినా
    పలకరించే దిక్కులేక
    మంచాన పడి ఏడ్చే
    ఒంటరితనం శిక్షను
    అనుభవిస్తున్నాను
    లోకమంతా చుట్టూ ఉన్నా
    కనిపించదు నీ లాంటి
    ఆత్మీయత అనురాగం
    ఆస్తుల ఆరాటమే తప్ప
    ఆదుకునే తత్వమే సున్న
    సతి అనే భాగం కోల్పోయాక
    పతి బతుకు కేవలం ఒక శూన్యం
    శ్వాస ఆగిపోయే క్షణంలోనైనా
    నీ చేతిలో చెయ్యేసి ఉంటే చాలు
    ఏడేడుజన్మల బంధమైనా
    నీతోడుతోనే ముగిసి పోవాలి
    ఆఖరి శ్వాసనీలోనే కలవాలి
    మరుజన్మంటూ ఉంటే మళ్ళీ
    నీవే కావాలి నీవే రావాలి
    కాలం దాటి మరణం దాటి
    మన ప్రేమ కథ అజరామరం
    కావాలి
    నేదునూరి కనకయ్య
    అద్యక్షులు
    తెలంగాణ ఎకనామిక్ ఫోరం
    కాలమిస్ట్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్
    కరీంనగర్
    9440245771