Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • షోయెబ్ అక్త‌ర్ ఇంట్లో విషాదం.

    Author VENKATESH | 24 Jun 2026, 03:45 PM | Sports
     షోయెబ్ అక్త‌ర్ ఇంట్లో విషాదం.

    పాకిస్థాన్ మాజీ క్రికెట‌ర్ షోయెబ్ అక్త‌ర్ ఇంట్లో విషాదం నెల‌కొన్న‌ది. షోయబ్ అక్త‌ర్ సోద‌రుడు షాహిద్ అక్త‌ర్ మృతిచెందిన‌ట్లు పాకిస్థాన్ మీడియా పేర్కొన్న‌ది. ఫాస్ట్ బౌల‌ర్ షోయెబ్ కూడా త‌న ఎక్స్ అకౌంట్‌లో ఈ విష‌యాన్ని ద్రువీక‌రించారు. క్రికెట్ అభిమానులు, మాజీ పాక్ క్రికెట‌ర్లు సోష‌ల్ మీడియాలో సంతాపం ప్ర‌క‌టించారు. అయితే ఏ కార‌ణం చేత అత‌ను చ‌నిపోయాడో తెలియ‌దు. త‌న సోదరుడు షాహిద్ అక‌ర్త అల్లా వ‌ద్ద‌కు చేరుకున్నాడ‌ని చెప్ప‌డం బాధ‌గా ఉంద‌ని అక్త‌ర్ త‌న మెసేజ్‌లో తెలిపాడు. పాక్ మాజీ క్రికెట‌ర్ ర‌షీద్ ల‌తీఫ్ నివాళి అర్పించాడు. షాహిద్ అక్త‌ర్ మృతి చెందార‌ని , హెచ్‌8 శ్మ‌శాన‌వాటిక‌లో అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఆయన చెప్పారు. అయిదేళ్ల క్రితం షోయెబ్ త‌ల్లి కూడా మృతిచెందారు. అయితే ఇటీవ‌ల క్రికెట్ పండిట్ అవ‌తార‌మెత్తాడు. ఇటీవ‌ల టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ స‌మ‌యంలో మ్యాచ్‌ల‌పై త‌న అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేశారు.