Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • వదశాల ప్రాంతంలో బోరు వేయించిన మున్సిపల్ చైర్పర్సన్, వార్డు కౌన్సిలర్

    Author VENKATESH | 27 Jun 2026, 04:46 PM | నారాయణపేట
    వదశాల ప్రాంతంలో బోరు వేయించిన మున్సిపల్ చైర్పర్సన్, వార్డు కౌన్సిలర్

    నారాయణపేట, జూన్ 27 (బివికె న్యూస్)

    తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు *డా. వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు మక్తల్ పట్టణంలోని కటికె కులస్తులకు వదశాల ప్రాంతంలో
    బోరు వేయించి, శనివారం మోటార్ బిగించి నీటి సౌకర్యం కల్పించడం జరిగింది.
    చాలా కాలంగా నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న కటికె సామాజిక వర్గానికి చెందిన కుటుంబాల అభ్యర్థనను మంత్రి దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే స్పందించి బోరు మంజూరు చేయించారు. అధికారులతో యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయించి మోటార్ బిగించి నీటిని విడుదల చేశారు.

    ఈ కార్యక్రమంనీలలో మున్సిపల్ చైర్ పర్సన్ వాకిటి మానస హనుమంతు , కౌన్సిలర్ కలాల్ శ్రీవిద్య గౌడ్ , కౌన్సిలర్ సరిత గోవిందరావు మైనారిటీ నాయకులు.. జిగిరే బాయ్.మతిన్.అల్తాఫ్ మున్సిపల్ సిబ్బంది, కటికె సామాజిక వర్గానికి చెందిన కుల పెద్దలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

    ఇవి కూడా చదవండి

    ఈ సందర్భంగా కటికె కులస్తులు మాట్లాడుతూ, "మా సమస్యను తెలుసుకొని వెంటనే బోరు వేయించి నీటి కష్టాలు తీర్చిన మంత్రివర్యులు వాకిటి శ్రీహరికి, మా కులస్తులందరి తరపున కృతజ్ఞతలు. ఈ మేలు ఎప్పటికీ మర్చిపోలేము" అని సంతోషం వ్యక్తం చేశారు.