Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా 'చిల్డ్రన్ ఫ్రెండ్లీ లీగల్ సర్వీసెస్ స్కీమ్–2024'పై చట్టపరమైన అవగాహన సదస్సు

    Author VENKATESH | 27 Jun 2026, 09:05 PM | కరీంనగర్
    జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా 'చిల్డ్రన్ ఫ్రెండ్లీ లీగల్ సర్వీసెస్ స్కీమ్–2024'పై చట్టపరమైన అవగాహన సదస్సు

    జిల్లా న్యాయసేవ అధికార సంస్థ, కరీంనగర్ ఆధ్వర్యంలో శనివారం కరీంనగర్ నగరంలోని మంకమ్మతోట ధంగర్‌వాడి హైస్కూల్‌లో "చిల్డ్రన్ ఫ్రెండ్లీ లీగల్ సర్వీసెస్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్–2024" (బాలల అనుకూల చట్టపరమైన సేవల పథకం)పై ప్రత్యేక చట్టపరమైన అవగాహన సదస్సు నిర్వహించారు.
    మధ్యాహ్నం 3:00 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయసేవ అధికార సంస్థకు చెందిన ప్యానెల్ న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్లు (PLVs) పాల్గొని విద్యార్థులకు చట్టపరమైన హక్కులు, ఉచిత న్యాయసేవలు పొందే విధానం, బాలల రక్షణకు సంబంధించిన చట్టాలు, "చిల్డ్రన్ ఫ్రెండ్లీ లీగల్ సర్వీసెస్ స్కీమ్–2024" ముఖ్య ఉద్దేశాలు, నిబంధనలు మరియు ఈ పథకం ద్వారా కలిగే ప్రయోజనాలపై సమగ్ర అవగాహన కల్పించారు.
    బాలల హక్కులను పరిరక్షించడం, చట్టాలపై చిన్నారుల్లో చైతన్యం పెంపొందించడం, అవసరమైన సమయంలో ఉచిత న్యాయ సహాయం పొందే అవకాశాలపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.
    ఈ కార్యక్రమంలో ప్యానెల్ న్యాయవాదులు అడ్వకేట్ చంద్రప్రకాష్ రెడ్డి, అడ్వకేట్ రంగయ్య, అడ్వకేట్ కిరణ్ కుమార్, అడ్వకేట్ అశ్విని, అడ్వకేట్ శాంతికుమార్ పాల్గొన్నారు.
    అలాగే పారా లీగల్ వాలంటీర్లు సి. సంజయ్ కుమార్, షమీమ్, సుజాత, స్వప్న కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు చట్టపరమైన అంశాలపై అవగాహన కల్పించారు.
    ఈ అవగాహన సదస్సులో వందలాది మంది బాలబాలికలు పాల్గొని తమ హక్కులు, చట్టపరమైన రక్షణ, ఉచిత న్యాయసేవలు పొందే విధానంపై విలువైన సమాచారాన్ని తెలుసుకొని చట్టపరమైన చైతన్యాన్ని పెంపొందించుకున్నారు.