Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ప్రభుత్వ ఆసుపత్రిలో పల్స్ పోలియో ప్రారంభించిన వార్డు కౌన్సిలర్ అల్కూరి పావని

    Author VENKATESH | 28 Jun 2026, 07:24 PM | నారాయణపేట
    ప్రభుత్వ ఆసుపత్రిలో పల్స్ పోలియో ప్రారంభించిన వార్డు కౌన్సిలర్ అల్కూరి పావని

    నారాయణపేట, జూన్ 28 (బి వి కే న్యూస్)
    మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రిలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని చిన్నారులకు పోలియో చుక్కలు వేసి స్థానిక వార్డు కౌన్సిలర్ అల్కూరి పావని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలను వేయించి... పోలియో మహమ్మారిని శాశ్వతంగా తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. పోలియో చుక్కలు వేయించని చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించేలా అవగాహన కల్పించాలని సూచించారు. దాదాపు 300 మంది పైగా చిన్నారులకు ఆసుపత్రి వద్ద పోలియో చుక్కలు వేయించారని తెలిపారు.
    కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు వల్లంపల్లి లక్ష్మణ్, మార్కెట్ డైరెక్టర్ శాలం, డాక్టర్ తిరుపతి, యాదగిరి , ఏఎన్ఎం సుధ, ఆశా వర్కర్ మహేశ్వరి, సత్యనారాయణ ,ఆనంపల్లి రమేష్, దామరగిద్ద రాము సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.