Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • తెలంగాణ రవాణా రంగంలో చారిత్రాత్మక ఘట్టం: రూ. 13,006 కోట్లతో 441 హ్యామ్ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన

    Author VENKATESH | 28 Jun 2026, 07:35 PM | నల్గొండ
    తెలంగాణ రవాణా రంగంలో చారిత్రాత్మక ఘట్టం: రూ. 13,006 కోట్లతో 441 హ్యామ్ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన

    దేవరకొండ 28జూన్ (BVK 3 న్యూస్ ) : నల్లగొండ జిల్లా కనగల్ లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రహదారుల అభివృద్ధి పథకంలో భాగంగా, రూ. 13,006 కోట్ల భారీ వ్యయంతో 6,092 కిలోమీటర్ల మేర 441 హ్యామ్ (HAM) రోడ్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం నల్లగొండ జిల్లా కనగల్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి విచ్చేశారు.ఈ కార్యక్రమంలో దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ పాల్గొని, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి మరియు రాష్ట్ర మంత్రులకు శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ మాట్లాడుతూ...
    ​కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో చిత్తశుద్ధితో పనిచేస్తోందని స్పష్టం చేశారు.
    ​రూ. 13,006 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు తెలంగాణ రవాణా రంగంలో ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలుస్తుందని అభివర్ణించారు.
    ​ఈ 441 రహదారుల అభివృద్ధి ద్వారా గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల మధ్య అనుసంధానం మెరుగుపడి, రైతులు, విద్యార్థులు, వ్యాపారులు మరియు సామాన్య ప్రజలకు రవాణా సౌకర్యాలు ఎంతో సులభతరం అవుతాయని తెలిపారు.
    ​ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి దార్శనిక నాయకత్వంలో, ప్రజల సంక్షేమం మరియు రాష్ట్ర సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన కొనియాడారు.అనంతరం జరిగిన బహిరంగ సభలో ఎమ్మెల్యే పాల్గొని, రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేస్తున్న ఈ మహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ముఖ్యమంత్రి గారికి మరియు ప్రభుత్వానికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.