Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • దేవరకొండ కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షులకు, చందంపేట మండల అధ్యక్షులకు ఘన సన్మానం

    Author VENKATESH | 28 Jun 2026, 09:42 PM | నల్గొండ
    దేవరకొండ కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షులకు, చందంపేట మండల అధ్యక్షులకు ఘన సన్మానం

    దేవరకొండ 28జూన్ (BVK 3 న్యూస్ ) : దేవరకొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షులుగా ఎన్నికైన శ్రీ మారుపాకుల సురేష్ గౌడ్ మరియు చందంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఎన్నికైన శ్రీ దొండేటి మల్లారెడ్డి గారిని సీవీఆర్ న్యూస్ ప్రతినిధి రాంబాబు ఘనంగా సన్మానించారు.
    ​ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ, నూతన బాధ్యతలు చేపట్టిన సురేష్ గౌడ్ మరియు మల్లారెడ్డిల సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ దేవరకొండ నియోజకవర్గంలో మరింత బలోపేతం అవుతుందని ఆకాంక్షించారు. పార్టీని క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువ చేయడంలోనూ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడటంలోనూ నూతన కమిటీలు చురుకైన పాత్ర పోషిస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
    ​అంతకుముందు, పార్టీ కార్యకర్తలు మరియు స్థానిక నాయకులు నూతన అధ్యక్షులను శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలతో ఘనంగా సత్కరించారు. తమపై నమ్మకం ఉంచి పార్టీ అధిష్టానం అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహిస్తామని, నియోజకవర్గ అభివృద్ధికి, కార్యకర్తల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తామని మారుపాకుల సురేష్ గౌడ్ మరియు దొండేటి మల్లారెడ్డి పేర్కొన్నారు.
    ​ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.