Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • దేవరకొండ చేనేత సహకార సంఘం ఎన్నికలకు నగారా.. షెడ్యూల్ విడుదల

    Author VENKATESH | 29 Jun 2026, 08:14 PM | నల్గొండ
    దేవరకొండ చేనేత సహకార సంఘం ఎన్నికలకు నగారా.. షెడ్యూల్ విడుదల

    దేవరకొండ 29జూన్ (BVK 3 న్యూస్ ) : దేవరకొండ తాలూకా చేనేత కార్మికుల సహకార సంఘం పాలకవర్గ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఎన్నికల అధికారి నామభాస్కర్ సోమవారం సంఘ సభ్యులతో ఎన్నికల నోటిఫికేషన్‌ను జారీ చేశారు.
    ఎన్నికల కీలక సమాచారం:
    ​మొత్తం ఓటర్లు: 431 మంది.
    ​ఎన్నుకోవాల్సిన సభ్యులు: 9 మంది కమిటీ సభ్యులు.
    ​పోలింగ్ తేదీ: జూలై 10 (ఎన్నికలు జరిగిన రోజే మధ్యాహ్నం ఫలితాల ప్రకటన).
    నామినేషన్ ప్రక్రియ:
    అభ్యర్థుల నుంచి నామినేషన్లను జూలై 2, 3, మరియు 4 తేదీలలో స్వీకరిస్తారు. అనంతరం జూలై 5న నామినేషన్ల పరిశీలన (స్కూటినీ) ఉంటుంది. జూలై 6న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియడంతో పాటు, అభ్యర్థులకు ఎన్నికల గుర్తులను కేటాయిస్తారు.
    ​సహకార సంఘం సభ్యులందరూ నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు కావాలని ఎన్నికల అధికారి నామభాస్కర్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జనత్సాకర్ సంఘం మేనేజర్ పులిజాల శ్రీనివాసులు చెరుపల్లి బాలరాజు , ముసిని అంజన్ ముసిని అంజిబాబు,చిలువేరు వీరేష్, వినయ్ గాజుల, వనం శ్రీనివాసులు , కుకూడాల సత్యనారాయణ లు పాల్గొన్నారు.