Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ప్రకృతి పరిరక్షణే లక్ష్యం: శాంతిగూడెంలో వన మహోత్సవం

    Author VENKATESH | 30 Jun 2026, 08:13 PM | నల్గొండ
    ప్రకృతి పరిరక్షణే లక్ష్యం: శాంతిగూడెంలో వన మహోత్సవం

    దేవరకొండ 30జూన్ (BVK 3 న్యూస్ ) :పచ్చని ప్రకృతిని కాపాడటం మనందరి బాధ్యత అని చాటిచెప్పేలా శాంతిగూడెం గ్రామ పంచాయతీలో 'వన మహోత్సవ' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ చింతలపూడి భాస్కర్ రెడ్డి మొక్కలు నాటారు.
    ​ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, పర్యావరణ సమతుల్యత కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, పచ్చదనాన్ని పెంపొందించాలని కోరారు. "ప్రతి ఇంటికీ ఒక మొక్క - ప్రతి ఒక్కరికీ ఒక బాధ్యత" అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ కార్యక్రమంలో ఈ క్రింది వారు పాల్గొని మొక్కలు నాటారు:
    ఉప సర్పంచ్: కోలా రమణమ్మ పిచ్చయ్య
    ​పంచాయతీ కార్యదర్శి: జున్ను వేణు
    ​ఫీల్డ్ అసిస్టెంట్: బర్పటి శ్రీను
    వీరితో పాటు వార్డు సభ్యులు మరియు గ్రామ పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటి, ప్రకృతిని కాపాడాలని పిలుపునిచ్చారు.