Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • హరిత విప్లవ వీరుడు

    Author VENKATESH | 30 Jun 2026, 08:54 PM | కరీంనగర్
    హరిత విప్లవ వీరుడు

    పద్మశ్రీ వనజీవి రామయ్య
    (జూలై 1 (1937 )పద్మశ్రీ వనజీవి రామయ్య గారి 89 వ జన్మదినం)
    (కోట్లాదిమొక్కలునాటిఆకుపచ్చని వనంగా మార్చినప్రకృతిప్రేమికుడు పద్మశ్రీ ధరిపెల్లి రామయ్య జయంతి సందర్భంగా
    నివాళి అర్పిస్తూ రాసిన కవిత)
    చేతిలో విత్తనం గుండెలో ఆశయం
    మట్టిని నమ్ముకున్న మహోన్నత
    జీవితం ధరిపెల్లి రామయ్యది
    తన బాల్యంలో టీచర్ మల్లేశం
    చెప్పిన మొక్కల పెంపకం లాభాలు
    అనే పాఠం ఆయన మనసుపై
    బలమైన ముద్రవేసింది
    సైకిల్ చక్రాలపై తిరిగి అడవుల్లో
    చెట్లు నాటిన హరిత విప్లవ
    వీరుడు పద్మశ్రీ వనజీవి రామయ్య
    సైకిల్ హ్యాండిల్ కు తగిలించిన
    పచ్చని సంచే డిల్లీ పీఠాన్ని
    కదిలించిన ఒక విప్లవ కేతనం
    ధరణికి పచ్చని కోట కట్టడమే
    లక్ష్యంగా జేబు నిండా విత్తనాలు
    పర్యావరణ రక్షణే లక్ష్యంగా
    నువ్వు నడిచిన దారులు
    నేడు పచ్చని వనాలు
    ఎండమావుల లాంటి
    సమాజంలో నువ్వో
    చల్లని నీడవు
    పదవుల కోసం కాక
    పర్యావరణం కోసంబతికావు
    చేతికి మట్టి అంటితేనే కదా
    ముద్ద నోట్లోకి వెళ్ళేది
    మొక్కకు నీరు పోస్తేనే కదా
    మనిషికి ఊపిరి అందేది
    అని నినదించిన ప్రకృతి
    ప్రేమికులు
    నెత్తిన ఎండకాస్తున్న
    అడుగులు ఆగలేదు
    ఎవరు ఏమనుకున్నా
    నీసంకల్పం మారలేదు
    కోట్లాది మొక్కలను నాటిన
    నీచేతులకు ధన్యవాదాలు
    ప్రతి మొక్కలోనూ
    నీప్రాణాన్ని చూశావు
    భావితరాలకు బతుకు
    దెరువు నిచ్చావు
    కోట్లాది వృక్షాల రూపంలో
    నీవే జీవించి ఉంటావు
    నువ్వు చేసిన పచ్చటిసంతకానికి
    వందనాలు పద్మశ్రీ పురస్కారమే
    నీనిరాడంబరతకు దాసోహమంది
    నువ్వు నాటిన ప్రతి వృక్షం నీకీర్తినే
    పాడుతుంది శ్వాస ఉన్నంతవరకు
    వనమే నీప్రపంచం నువ్వుచూపిన
    బాటలో సాగాలి మాపయనం
    భావితరాలకుఆక్సిజన్అందించిన
    అమృత మూర్తివి ఈ నేల తల్లి
    గర్వించే, నిరుపమానకీర్తివి
    ఓవనజీవి నీజయంతి వేళ
    ఈ నేల గుండెల్లో ఎప్పటికీ
    నిలిచే ఉంటావు
    తలపై వృక్షో రక్షిత రక్షితః
    అనే హరితకిరీటం
    అదే నీ జీవితానికి
    పరమార్థమైన నినాదం
    అవార్డులను అందుకున్న ఆదర్శ
    పర్యావరణ వేత్త వంజీవివి నీవు
    సేవా అవార్డ్ (1995) వన మిత్ర
    పురస్కారం (2005) నేషనల్ ఇన్నోవేషన్అవార్డ్(2015)
    పద్మశ్రీ అవార్డు (2017)
    స్వచ్ఛంద కృషికి దాసోహమన్న
    జాతీయ పురస్కారాలు
    డిల్లీ రాష్ట్రపతి భవన్లో పద్మశ్రీ
    అవార్డ్ అందుకుంటున్న వేళ
    కోటి వృక్షాల శ్వాసనీగుండెల్లో
    ప్రతిధ్వనించింది గౌరవ డాక్టరేట్
    అందుకున్నపుడు మట్టి వాసనే
    నీశ్వాసగా మార్చుకున్నావు
    మూడుఎకరాల సొంత బూమిని
    సైతం అమ్మి విత్తనాలు కొన్న
    గొప్ప త్యాగశీలివి‌ నీవు
    నీనిరడంభరత అవార్డులకే
    గొప్ప గౌరవాన్నిచ్చింది
    నిజమైన పద్మశ్రీవి నువ్వు
    ఈనేలకన్న పచ్చని నిధివి నువ్వు
    ఇవే నీకు మా అక్షర నివాళులు
    పచ్చని అడవులు ప్రకృతి రక్షణే
    రామయ్య గారికి నిజమైన నివాళి
    ప్రకృతిని రక్షిద్దాం ప్రజా ప్రగతిని
    సాధిద్దామని ప్రతిజ్ఞ చేద్దాం
    నేదునూరి కనకయ్య
    1)రాష్ట్రఅధ్యక్షులు
    తెలంగాణ కుమ్మర సంఘం 880/2014
    2)అధ్యక్షులు తెలంగాణ
    ఎకనామిక్ ఫోరం
    3)మాజీ ఎన్ ఎస్ ఎస్ అధికారి
    4)మాజీ కరెస్పాండెంట్
    జస్టిస్ కుమారయ్య లా కాలేజీ
    కరీంనగర్9440245771