Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మత్స్య డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు ప్రభుత్వం అండగా ఉంటుంది

    Author VENKATESH | 02 Jul 2026, 12:13 AM | నారాయణపేట
    మత్స్య డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు ప్రభుత్వం అండగా ఉంటుంది

    మంత్రి వాకిటి శ్రీహరి
    - రాష్ట్రంలో చేపల ఉత్పత్తి లో మీ సేవలను వినియోగించుకుంటాం
    - మత్స్య శాఖలో ఖాళీ పోస్టుల భర్తీకి ప్రయత్నం
    నారాయణపేట, జూలై 1 (బీవీకే న్యూస్ )
    మత్స్య శాఖ లో సమూల మార్పులు తీసుకొస్తున్నామని, మత్స్య డిగ్రీ చేసిన విద్యార్థులకు ప్రభుత్వ అండగా ఉంటుందని, రాష్ట్రంలో చేపల ఉత్పత్తిలో మీ సేవలను ఉపయోగించుకుంటామని తెలిపారు రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి. బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్(BFSc) విద్యార్థులు బుధవారం సచివాలయం లో మంత్రిని కలిసి పలు సమస్యలను విన్నవించారు బిఎఫ్ ఎస్ సి విద్యార్థులు.
    వెంటనే ఫిషరీస్ ఎండీ నిఖిలను పిలిపించి సమస్యలను ఆమె దృష్టికి తీసుకువచ్చారు
    ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.....
    BFSc కోర్సు పూర్తి అయిన తర్వాత చేపల పరిశ్రమలో వీరిని ఎలా ఉపయోగించుకోవాలో ఒక నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 500 మందికి పైగా బి.ఎఫ్‌.ఎస్‌సి. (B.F.Sc.), 200 మందికి పైగా ఎం.ఎఫ్‌.ఎస్‌సి. (M.F.Sc.), 50 మందికి పైగా పీహెచ్‌.డి. (Ph.D.) ఫిషరీస్ పట్టభద్రులు తయారయ్యారని,
    అలాగే, తెలంగాణకు చెందిన 60 మందికి పైగా విద్యార్థులు పెబ్బేరు ఫిషరీస్ కళాశాలతో పాటు భారతదేశంలోని ఇతర ఫిషరీస్ కళాశాలల్లో విద్యాభ్యాసం పూర్తి చేశారని తెలిపారు.ప్రతీ ఏడాది దాదాపు 70 మంది విద్యార్థులు కోర్సు పూర్తయి బయటికి వస్తున్నారని....వచ్చిన ప్రతి ఒక్కరికి మత్స్య శాఖ లో ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి చేపల ఉత్పత్తి లో మీరే ఓ పదిమందికి ఉపాధి కల్పించేలా ప్రభుత్వం తరఫున ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు.

    క్రీడా శాఖ, పాడి పరిశ్రమ, పశు సంవర్ధక, యువజన శాఖల్లో భారీ మార్పులు తీసుకొచ్చి సమూలంగా ప్రక్షాళన చేశామన్నారు. ఇప్పుడు అదేవిధంగా మత్స్య శాఖ లో కూడా మార్పులు చేస్తున్నామని స్పష్టం చేశారు.

    రాష్ట్రంలో ప్రతీ సంవత్సరం జలాశయాలల్లో , చెరువులల్లో ఉచిత చేప పిల్లల పంపిణీ కి 85 కోట్ల చేప పిల్లలు అవసరం ఉండగా 15 కోట్లు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయని... మిగతా 70 కోట్ల చేప పిల్లలను పక్క రాష్ట్రం నుండి కొంటున్నామని తెలిపారు. ఈ చేప పిల్లల ఉత్పత్తి ని పెంచేందుకు మత్స్య కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు అవకాశం ఇవ్వాలన్నారు. తద్వారా మనం ఖర్చు పెట్టే ప్రతి పైసా మన పిల్లలకే చెందుతుందని మంత్రి వెల్లడించారు.
    బయటి రాష్ట్రాల నుండి మనం చేపలను కొనకుండా చేపల సీడ్ మనదే ఉండాలని, ఉత్పత్తి కూడా మనదే ఉండాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో ఐదు లక్షల మెట్రిక్ టన్నుల చేపల ఉత్పత్తి జరుగుతుందని.. వీరికి ప్రోత్సాహకాలు అందిస్తే మరింత ఉత్పత్తి పెరుగుతుందని మంత్రి పేర్కొన్నారు.ఇప్పుడు ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకంలో చేపల కూరను చేర్చుతుండడంతో మత్స్య డిగ్రీ పూర్తి చేసిన యువతీ, యువకుల సేవలను ఎలా వినియోగించుకోవచ్చో ఒక నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
    మత్స్య శాఖ లో రెగ్యులర్, అవుట్ సోర్సింగ్ విభాగల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ఫిషరీస్ ఎండీ నిఖిల మంత్రి దృష్టికి తేగా ఆయా పోస్టుల ఖాళీల వివరాలను సమర్పించాలని వారికి సూచించారు.

    ఇవి కూడా చదవండి