Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • రైతే రాజు?

    Author VENKATESH | 02 Jul 2026, 12:15 AM | కరీంనగర్
    రైతే రాజు?

    జనాభాకు తిండిని
    చేతికి పని
    ఆర్థిక వ్యవస్థలో
    ఉత్పత్తి ఉత్పాదకత
    జీవన ప్రమాణాలను
    పెంచుతున్న
    వ్యవసాయ రంగం
    సమస్యలతో కుదేలైంది
    మట్టిని నమ్మిన రైతు గుండెకు
    భరోసా భద్రత కరువైంది
    ప్రభుత్వం విధానాలురైతుల
    పాలిట శాపాలుగా నిలిచాయి
    పెట్టుబడికష్టాలు దిగుబడి తగ్గి
    రైతులు అప్పులో పుట్టి అప్పుల్లో
    పెరిగి అప్పుల్లోనే మరణిస్తున్నారు
    మెరుగైన సాగు విధానాలతో
    రైతులముఖాల్లోవెలుగులు తేవాలి
    రైతుల ఆత్మ హత్యలు ఆపాలి
    పాత సాగు పద్ధతులపై
    విశ్వాసం ఉంచుతూ
    ప్రభుత్వాలు సాగుకు కొత్త
    ఊపిరినివ్వాలి
    ఉచిత విద్యుత్తు కాంతులతో
    పొలాలు పండుతున్నాయి
    రైతు బీమా ధీమాతో
    కుటుంబాల్లో బరోసా ఏర్పడుతుంది
    ప్రభుత్వంమట్టి పరీక్షలు చేసి
    భూసారం తెలుపుతూ విజ్ఞానం
    పంచుతుంది రసాయనాల
    మోతాదు తగ్గించే మార్గం
    చూపుతూ అధికదిగుబడులకై
    అడుగులు వేస్తుంది
    సన్నకారు రైతుల పంటలకు
    గిట్టుబాటు ధరలు లేక
    పల్లెవాసులు పట్టణాలకు
    వలసపోతున్నారు
    జైజవాన్ జై కిసాన్ నినాదం
    నినాదంగానే మిగిలింది
    రైతు సంక్షేమమే కేంద్రంగా
    బడ్జెట్ కేటాయించాలి
    చిన్ననీటి వనరుల
    అభివృద్ధిలో రైతాంగాన్ని
    భాగస్వామ్యం చేయాలి
    మహిళా రైతుల ఆర్థిక
    సంక్షేమానికి పెద్దపీట
    వేయాలి రైతు సంక్షేమమే
    ధ్యేయంగా పాలన
    విధానాలను
    అవిష్కరించాలి
    రైతు రాజ్యం రావాలి
    పల్లెలు ప్రగతి సాధించాలి
    (జూలై 1 ప్రపంచ వ్యవసాయ దినోత్సవం సందర్భంగా)
    నేదునూరి కనకయ్య
    అధ్యక్షులు
    తెలంగాణ ఎకనామిక్ ఫోరం
    ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ కాలమిస్ట్
    కరీంనగర్9440245771