Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మహిళను నమ్మించి తీసుకెళ్లి.. బంగారం లాక్కొని ఎంతపని చేశాడంటే!

    Author VENKATESH | 02 Jul 2026, 06:16 PM | కరీంనగర్
    మహిళను నమ్మించి తీసుకెళ్లి.. బంగారం లాక్కొని ఎంతపని చేశాడంటే!

    జిల్లాలోని తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామంలో అమానుషమైన ఘటన వెలుగుచూసింది. పని ఇప్పిస్తానని నమ్మబలికిన ఒక దుండగుడు ఓ మహిళను ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లి, ఆమె మెడలోని అర తులం బంగారాన్ని లాక్కున్నాడు. అంతటితో ఆగకుండా తన గుట్టు బయటపడుతుందని భావించి.. ఎలాంటి ఆధారాలు లేకుండా చేయాలనే క్రూర ఉద్దేశంతో ఆమెను పక్కనే ఉన్న ఒక వ్యవసాయ బావిలోకి తోసేసి అక్కడ నుంచి పరారయ్యాడు.
    బావిలో పడిపోయిన సదరు మహిళ సుమారు 24 గంటల పాటు మృత్యువుతో పోరాడింది. ఉదయం బావి వద్దకు వెళ్లిన యజమాని లోపల నుంచి శబ్దాలు రావడంతో గమనించగా, మహిళ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ కనిపించింది. దీంతో ఆయన వెంటనే స్థానికులకు సమాచారం అందించారు. గ్రామస్థులంతా అక్కడికి చేరుకుని తాళ్లు, మంచం సహాయంతో ఆమెను బావిలో నుంచి సురక్షితంగా బయటకు తీశారు.