Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • రైతు సమన్వయ సమితి మండల మాజీ అధ్యక్షుడు రమావత్ లాలు నాయక్ 6వ వర్ధంతి ఘనంగా నిర్వహణ

    Author VENKATESH | 04 Jul 2026, 02:14 PM | నల్గొండ
    రైతు సమన్వయ సమితి మండల మాజీ అధ్యక్షుడు రమావత్ లాలు నాయక్ 6వ వర్ధంతి ఘనంగా నిర్వహణ

    దేవరకొండ 04జూలై (BVK 3 న్యూస్ ) : రైతు సమన్వయ సమితి మండల మాజీ అధ్యక్షుడు రమావత్ లాలు నాయక్ చేసిన సేవలు చిరస్మరణీయమని మాజీ దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.
    శనివారం చందంపేట మండలం బిల్డింగ్ తండాలో రమావత్ లాలు నాయక్ 6వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రవీంద్ర కుమార్ మాట్లాడుతూ...లాలు నాయక్ పేద ప్రజల పక్షపాతిగా, ప్రజాసేవకుడిగా గుర్తింపు పొందారని కొనియాడారు.
    లాలు నాయక్ ప్రజా సంక్షేమం కోసం చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివని పేర్కొన్న ఆయన, వారి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.