Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఓ మనిషి

    Author VENKATESH | 04 Jul 2026, 06:44 PM | కరీంనగర్
    ఓ మనిషి

    రెచ్చగొట్టే మాటలు వద్దు
    పట్టుదలే ప్రగతియే ముద్దు
    ఓ మనిషి
    నిన్ను రెచ్చగొట్టే వారి
    మాటలు పట్టించుకోకు
    నీ మనసులోని
    ధైర్యాన్ని వదులుకోకు
    ఎవరో అనే మాటలను
    అసలు వినకు నీముందుకు
    సాగే అడుగును ఆపకు
    కష్టపడే తత్వం పట్టుదలే
    నీ తోడుకావాలి నీనీడ కావాలి
    ముందుకెళ్ళే ఆలోచనే నీదారి
    కావాలి గెలుపే నీ అడ్రస్ కావాలి
    వెనక్కి లాగే శక్తులను
    దాటుకుంటూ పో
    అడ్దం వచ్చిన వారిని
    అడ్డుకుంటూ
    ముందుకు సాగిపో
    నీకంటూ ఒక కొత్త
    చరిత్రను రాసుకో
    నిందలు వేసే
    పెదవులను
    చూసి నవ్వుకు
    నిన్ను తక్కువ చేసే
    మాటలకు లొంగకూ
    నీలో ఉన్న శక్తిని
    నువ్వు నమ్ముకో
    గెలుపు వైపు
    నీప్రయాణం సాగించు
    కాలం ఎప్పుడూ ఒకేలా
    ఉండదు ఓటమి ఎదురైన
    గెలుపు పాఠంగా మార్చుకో
    ప్రగతి బాటలో
    నీ అడుగులు పడాలి
    నీ పయనం అందరికి
    ఆదర్శం కావాలి
    ఆకాశమంత ఎత్తుకు
    ఎదగడమే నీహద్దు కావాలి
    నిన్ను ఆపే ఏ ఆలోచనా వద్దు
    నమ్మకంతో ముందుకు సాగిపో
    విజయాన్ని అందుకొని లోకానికి
    చూపించు
    నిన్ను వెనక్కి లాగే
    విమర్శలను వినడం
    ఆపేసి నీపట్టుదల
    అనే ఇంధనంతో
    ప్రగతివైపు దూసుకుపో
    నీ గెలుపే నిన్ను రెచ్చగొట్టిన
    వారికి సరైన సమాధానం
    అవుతుంది
    నిందలు తుపానులు
    నిన్ను చుట్టుముట్టిన
    నీ ఆత్మవిశ్వాస దీపాన్ని
    ఆరి పోనివ్వకు
    నిన్ను గత కాలం వెక్కిరించిన
    రాబోయే విజయం వారి
    నోళ్లను మూయిస్తుంది
    నీసంకల్పమే నీఆయుధం
    అప్రతిహతంగా ముందుకు
    సాగిపో
    నిరంతరం రెచ్చగొట్టడానికి
    ప్రయత్నించేవారు మానసికంగా
    అశాంతితో బాధతో ఉంటారు
    అలాంటి వారి గురించి ఆలోచించి
    మీసమయాన్ని వృధా చేసుకోకండి
    గమ్యం వైపు అడుగులు వేసే
    ప్రగతి పురోగతియే నీ హద్దైతె
    నీవు సమాజానికి మార్గదర్శివి
    అవుతావు
    నేదునూరి కనకయ్య
    ఫ్రీలాన్స్ జర్నలిస్ట్
    కాలమిస్ట్
    కరీంనగర్9440245771