Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • దేవరకొండ నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి: ఉపముఖ్యమంత్రిని కలిసిన ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్

    Author VENKATESH | 05 Jul 2026, 06:44 PM | నల్గొండ
    దేవరకొండ నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి: ఉపముఖ్యమంత్రిని కలిసిన ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్

    దేవరకొండ 05జూలై (BVK 3 న్యూస్ ) : హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి శ్రీ బట్టి విక్రమార్క గారిని దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ కలిశారు.

    ఈ సందర్భంగా "దేవరకొండ నియోజకవర్గంలో విద్యుత్ సరఫరా, విద్యుత్ మౌలిక సదుపాయాల బలోపేతం, పెండింగ్‌లో ఉన్న విద్యుత్ సంబంధిత పనులు, కొత్త ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు, లైన్ల విస్తరణతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న ఇతర ప్రధాన సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు."

    నియోజకవర్గ ప్రజలకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించడంతో పాటు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే బాలు నాయక్ విజ్ఞప్తి చేశారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఎమ్మెల్యేకు హామీ ఇచ్చారు.

    ఇవి కూడా చదవండి

    ప్రజల సమస్యల పరిష్కారమే తన ప్రథమ కర్తవ్యమని, దేవరకొండ నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన ప్రతి అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ తెలిపారు.