Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ జీవో అమలు చేయాలి: దేవరకొండలో జర్నలిస్టుల నిరసన

    Author VENKATESH | 06 Jul 2026, 05:52 PM | నల్గొండ
    జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ జీవో అమలు చేయాలి: దేవరకొండలో జర్నలిస్టుల నిరసన

    దేవరకొండ 06జూలై (BVK 3 న్యూస్ ) : జర్నలిస్టుల పిల్లలకు పాఠశాలల్లో ఫీజు రాయితీ కల్పించే విషయంలో ప్రభుత్వం మరియు విద్యాశాఖ అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ, సోమవారం దేవరకొండ మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) కార్యాలయం ముందు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ - IJU) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.
    ​ఈ సందర్భంగా TUWJ డివిజన్ అధ్యక్షుడు గాదె గిరిధర్ రావు మరియు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కరుణాకర్ మాట్లాడుతూ... పాఠశాలలు ప్రారంభమై 20 రోజులు గడుస్తున్నా, జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీకి సంబంధించిన సర్క్యులర్‌ను విద్యాశాఖ ఇప్పటికీ విడుదల చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు హామీలు ఇస్తున్నా, క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
    ​వెంటనే సంబంధిత జీవోను విడుదల చేసి, జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ అందేలా చూడాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం ఈ మేరకు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని దేవరకొండ ఎంఈఓ మాతృ నాయక్ గారికి అందజేశారు. సమస్యను తక్షణమే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని ఎంఈఓ హామీ ఇచ్చారు.
    ​ఈ కార్యక్రమంలో డివిజన్ పరిధిలోని పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.